ETV Bharat / state

వైభవంగా కార్తిక రెండో సోమవారం, పౌర్ణమి.. శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు

Kartika Poornima : శివునికి ఎంతో ప్రీతిపాత్రమైన కార్తికమాసం సందర్భంగా రాష్ట్రంలోని పలు శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక సోమవారం, పౌర్ణమి కలిసి వచ్చిన వేళ.. పవిత్ర స్నానాల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు నదితీరాలకు తరలివచ్చారు. కార్తిక పౌర్ణమి రోజున పరమేశ్వరుడికి నమక, చమక, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకాలు చేస్తున్నారు. భక్తుల శివనామస్మరణతో శివాలయాలు మార్మోగుతూ.. ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి

karteeka masam pujalu
karteeka masam pujalu
author img

By

Published : Nov 7, 2022, 10:13 AM IST

రాష్టంలో కార్తిక మాసం రెండో సోమవారం పూజలు

Karthika Masam Second Monday : పవిత్ర కృష్ణానదీ తీరం అంతటా కార్తిక శోభ సంతరించుకుంది. కార్తిక సోమవారం, పౌర్ణమి కలిసి వచ్చిన వేళ.. పవిత్ర స్నానాల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు కృష్ణానదికి తరలివచ్చారు. విజయవాడలో తెల్లవారుజాము నుంచే నది చెంతన జల్లు స్నానాలు ఆచరించి.. దీపాలు వదిలి తమ భక్తిప్రపత్తులు చాటుకుంటున్నారు. రేపు చంద్రగ్రహణం ఉండడంతో ఇవాళ చాలా మంది కార్తిక పౌర్ణమి రోజు నిర్వహించే పూజలు, గౌరీ నోములు నోచుకుంటున్నారు.

కార్తిక పౌర్ణమి రోజున పరమేశ్వరుడికి నమక, చమక, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకాలు చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ట్రాఫిక్‌ మళ్లింపులు, ఆంక్షలు విధించారు. శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇవాళ సాయంత్రం ఇంద్రకీలాద్రిపై కోటిదీపోత్సవం నిర్వహించేందుకు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. సాయంత్రం జ్వాలాతోరణం నిర్వహించనున్నట్లు ఈవో భ్రమరాంబ తెలిపారు.

శివునికి ఎంతో పీతిపాత్రమైన కార్తికమాసం సందర్భంగా.. శ్రీశైల ఆలయంలో పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పౌర్ణమి సందర్భంగా స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. సా.6.30 గంటలకు ఆలయం ముందు భాగంలో జ్వాలా తోరణోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 7:30 నుంచి ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవాన్ని ఘనంగా చేపట్టనున్నారు.

కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తిక మాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ, అభిషేకాలు నిర్వహించారు. పుణ్య స్నానాలు ఆచరించిన మహిళలు కార్తికదీపాలు వెలిగిస్తూ తమ మొక్కులను చెల్లించుకున్నారు. పవిత్ర కార్తికమాస ఉత్సవాల్లో వేలాదిగా పాల్గొంటున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని దేవదాయ శాఖ అధికారులు తెలిపారు.

పశ్చిమ గోదావరి జిల్లా కార్తిక మాసం రెండవ సోమవారం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వశిష్ఠ గోదావరిలో కార్తిక పుణ్య స్నానాలకు భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచి నరసాపురం తో పాటు పలు ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. గోదావరి మాతకు పూజలు చేసి కార్తిక దీపాలు నది లో విడిచి పెట్టారు. భక్తుల శివనామస్మరణతో శివాలయాలు మార్మోగుతూ.. ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. పలు ఆలయాల్లో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు.

నరసాపురంలోని కపిల మల్లేశ్వర, అమరేశ్వర , విశ్వేశ్వర , ఏకాంబరేశ్వర స్వామి, లక్ష్మమనేశ్వరం ప్రసిద్ధ దుర్గా లక్ష్మణేశ్వర స్వామి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. పురాతన ఆలయంలో స్వామికి భక్తులు ప్రత్యేక పూజలు, పాలాభిషేకాలు చేశారు. దేవాలయ ప్రాంగణంలో మహిళలు దీపారాధనలు చేశారు. రావణ వధ అనంతరం పాప పరిహారార్థం లక్ష్మణుడు ఈ ప్రాంతంలో శివలింగం ప్రతిష్టించినట్లు పురాణ గాథ చెబుతుంది. కార్తిక మాసం పర్వదినాలలో స్వామివారిని దర్శించుకుంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని, సకల శుభాలు జరుగుతాయని భక్తుల నమ్మకం. ఈ రోజు నదీ స్నానాలు ఆచరించి కార్తిక దీపాలు నదిలో వదిలితే పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తిక మాసం 2వ సోమవారం తెల్లవారుజాము నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. ఈరోజు పౌర్ణమి రాత్రిగా రావడం వల్ల 33 పున్నమి నోములు నోచుకునే వారు, ఉపవాసం ఉండేవారు 365 వత్తుల దీపారాధన చేసేవారు ఈ సోమవారం చేసుకోవాలని ఆలయ అర్చకులు తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలోని గోకర్ణేశ్వర స్వామి ఆలయం కార్తిక మాసం రెండో సోమవారం సందర్భంగా భక్తులతో సందడిగా మారింది. తెల్లవారుజాము నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు చేశారు. కార్తిక మాసంలో ముఖ్యంగా స్వామి వారికి ప్రీతిపాత్రమైన సోమవారం రోజున దర్శించుకుంటే సర్వ పాపాలు హరించి ముక్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. స్వామివారికి పాలు, పళ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఉండ్రాజవరం మండలం పాలంగిలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం కార్తిక మాసం రెండో సోమవారం సందర్భంగా భక్తులతో సందడిగా మారింది. తెల్లవారుజాము నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు.

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో వృద్ధ గౌతమీ గోదావరి తీరాన కొలువైన కుండలేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. గోదావరి చెంతన స్నాన ఘట్టం వద్ద ఏర్పాటు చేసిన శివలింగానికి భక్తుల పూజలు చేస్తున్నారు. కొండలేశ్వర స్వామికి ఆలయంలో ప్రధాన అర్చకులు అభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు స్వామి వారి దర్శించుకుని తీర్థప్రసాదాలు సేకరిస్తున్నారు.

కోనసీమ జిల్లా కార్తిక మాసం రెండో సోమవారం పురస్కరించుకుని కోనసీమ జిల్లాలో పంచారామక్షేత్ర మైన ద్రాక్షారామంలో కొలువునై అమ్మవారిని తెల్లవారుజామున నుంచి వేలాదిగా తరలి వచ్చి దర్శించుకుంటున్నారు. స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు.. ఆలయ ప్రాంగణంలో కార్తిక దీపాలు వెలిగించారు.

ప్రకాశం జిల్లా రెండో కార్తిక సోమవారం సందర్భంగా యర్రగొండపాలెంలోని శివాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. దేవాలయంలో తెల్లవారుజాము నుంచే శివుని దర్శనం కోసం భక్తులు బారులుదీరారు. భక్తులు శివయ్యకు ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు నిర్వహించారు. శివాలయ ప్రాంగణంలో మహిళలు పెద్దఎత్తున కార్తికదీపాలు వెలిగించారు.

కర్నూలులో కార్తిక పౌర్ణమి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే మహిళలు పెద్ద సంఖ్యలో దేవాలయాల ముందు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. కేసీ కాలువలో దీపాలు వదిలేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.