ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా కనుమ పండుగ.. గోమాతకు విశేష పూజలు - గోమాత పూజ

kanuma Celebrations: రాష్ట్రంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ వేడుకలు జరుపుకొంటున్నారు. సంక్రాంతి మరుసటి రోజు వచ్చే కనుమ పండుగని.. పశువుల పండుగగా కూడా భావిస్తారు. కనుమను పురస్కరించుకొని ప్రజలందరు గోమాతను పూజించి తరించారు. పండుగ సందర్బంగా ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

Kanuma festival
రాష్ట్రవ్యాప్తంగా కనుమ పండుగ సంబరాలు
author img

By

Published : Jan 16, 2023, 7:17 PM IST

రాష్ట్రవ్యాప్తంగా కనుమ పండుగ.. గోమాతకు విశేష పూజలు

kanuma Celebrations : సకల దేవతలకు మూలదేవతగా కొనియాడబడుతున్న గోమాతను పూజించడం ద్వారా సర్వ సౌఖ్యాలు కలుగుతాయని ప్రతీతి..హైందవ సంస్కృతి లో గోమాతకు ఎంతో ప్రత్యేకత ఉంది. పవిత్రమైన కనుమ పండగ రోజు గోమాతను దర్శించుకోవడం ద్వారా 33 కోట్ల మంది దేవతలను దర్శించుకునే భాగ్యము కలుగుతుందని అంటారు. అంతే కాకుండా వ్యవసాయంలో రైతులకు సహకరించిన పశువులను అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించటం ఈ పర్వదినం ప్రత్యేకత. వ్యవసాయంలో తమతో పాటు కష్టించే పశువులను పూజించటం కనుమ పండుగ విశిష్టతగానూ చెప్పుకుంటారు. అదేవిధంగా ఉత్తరాయణ పుణ్యకాలం అయిన కనుమ నాడు గోవుని పూజిస్తే పితృదేవలతో పాటు సకల దేవుళ్లను ఆరాధించినట్లు భావిస్తారు.

ఎన్టీఆర్ జిల్లా : కనుమ పండుగ సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం గోశాల వద్ద ఆలయ వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా గోపూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో భ్రమరాంబ పాల్గొని గోమాతకు పూజలు నిర్వహించి, ఆహారం అందించి గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేశారు.

పార్వతి పురం మన్యం జిల్లా : పాలకొండ కోటదుర్గ పాలకొండ కోటదుర్గ ఆలయంలో గోమాతకు విశేష పూజలు నిర్వహించారు. ఆలయం ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీ ప్రసాద్ శర్మ మాట్లాడుతూ అనాటి నుంచి గోమాతను పూజించే సంప్రదాయం హిందూ సమాజంలో వస్తుందని అన్నారు.

శ్రీకాకుళం జిల్లా : రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు కనుమ పండగ వేళ ప్రముఖ ఆలయాలైన శ్రీ కోటదుర్గ అమ్మవారి ఆలయంలో గోపూజ కార్యక్రమం నిర్వహించారు. సకలదేవతా స్వరూపమైన గోమాతను పూజించడం ద్వారా సర్వ శుభాలు కలుగుతాయని నానుడి. ఆమదాలవలస మండలం శ్రీనివాసాచార్యుల పేట గ్రామం దేవాంగుల వీధిలో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి.

కృష్ణాజిల్లా : పెదముత్తేవిలో కనుమ పండగ సందర్భంగా గ్రామీణ ప్రాంత వ్యవసాయదారులు రైతులు పాడి పశువులకు పూజలు నిర్వహించారు. సంవత్సర కాలంగా తమతో పాటు కష్టపడి పని చేసి తమ ఆర్థిక అభివృద్ధికి చేదోడు వాదోడుగా ఉండే ఆవులు, ఎద్దులు, ఇతరపాడి పశువులకు కృతజ్ఞతగా, కుటుంబ సమేతంగా ప్రేమతో పూజించారు. పిండి వంటలు, నైవేద్యాలు తినిపించి పూజించి కృతజ్ఞత చాటుకున్నారు.

విజయనగరం జిల్లా : ఈ కార్యక్రమాన్ని టీటీడీ విజయనగరం శాఖ అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించింది. విజయనగరం టీటీడీ కల్యాణ మండపం ఆవరణలో వేంచేసి ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో గోవులకు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. పూజలు అనంతరం వస్త్రాలు సమర్పించి నైవేద్యం అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులతో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలసి గోపూజ నిర్వహించి ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు కనుమ, గోపూజ విశిష్ఠతను తెలియచేశారు.

నెల్లూరు జిల్లా : తల్పగిరి రంగనాధ స్వామి ఆలయంలో భక్తులు పూజలు నిర్వహించారు. సంక్రాంతి వరసలో వచ్చే చివరి పండగ కనుమ పండగ. నెల్లూరు జిల్లాలోని తల్పగిరి రంగనాధుడు ఆలయం, రాజరాజేశ్వరీ, ఇస్కాన్ సిటిలోని ఆలయాల్లో పెద్ద ఎత్తున పూజలు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.