Kodangal, Telangana Election Result 2023 LIVE : తెలంగాణలో గత నెల 30వ తేదీన నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ హవా నడుస్తోంది. మోజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ అధిక్యంలో ఉంది. అయితే ఈ ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొండగల్ నియోజకవర్గంలో విజయం సాధించారు. ఆయన ఈ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేశారు. మొదటది కొడంగల్ నియోజకవర్గం కాగా.. రెండో నియోజకవర్గమైన కామారెడ్డిలో పోటీ చేశారు. కామారెడ్డిలో బీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్‌పై నామీనేషన్ దాఖలు చేసి.. ఎన్నికల కౌటింగ్లో ముందంజలో ఉన్నారు. ఎనిమిదో రౌండ్ కౌటింగ్ వరకు దాదాపు 2వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి బరిలో దిగి ఓటమి చవిచూసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈసారి మాత్రం గెలుపు దిశగా పయనిస్తున్నారు. కొడంగల్‌తో పాటు కామారెడ్డిలోనూ పోటీకి దిగిన రేవంత్ రెండు చోట్లా ముందంజలో కొనసాగుతున్నారు. రేవంత్‌కు ప్రత్యర్థులుగా కొడంగల్‌లో బీఆర్ఎస్ తరఫున పట్నం నరేందర్ రెడ్డి, బీజేపీ తరఫున బంతు రమేశ్‌కుమార్ ఉన్నారు. ఇక కామారెడ్డిలో సీఎం కేసీఆర్, బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డిలు ప్రత్యర్థులుగా బరిలో నిలిచారు.