ETV Bharat / state

అంతర్జాతీయ మహిళ దినోత్సవం.. శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు..

International Womens Day : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర గవర్నర్​, టీడీపీ అధినేత, జనసేన అధినాయకుడు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా లండన్​లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తెలుగు మహిళలు ఘనంగా నిర్వహించుకున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Mar 8, 2023, 2:01 PM IST

Womens Day Wishes : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు మహిళలు వేడుకలు నిర్వహించారు. విదేశాల్లోనూ తెలుగు మహిళలు మహిళా దినోత్సవం జరుపుకొన్నారు. అంతేకాకుండా పలువురు ప్రముఖులు మహిళా దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు తిరుగులేని నాయకత్వ పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. మహిళా సమానత్వం, సాధికారత కోసం కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.

మహిళలకు గవర్నర్​ శుభాకాంక్షలు : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌నజీర్‌ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు దేశ నిర్మాణంలోనూ, జాతీయ సమగ్రత, శాంతి, సామరస్యాన్ని నిలబెట్టడంలో ఎల్లప్పుడూ గొప్ప పాత్ర పోషిస్తూ వచ్చారని కొనియాడారు. మహిళలు ఎప్పుడు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని అన్నారు. సమాజంలోనూ, కుటుంబ సంప్రదాయాలలోనూ, ఇంకా అనేక రంగాలలో మహిళలు తిరుగులేని నాయకత్వ పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. స్త్రీలు సహనం, ఓర్పుకి మారుపేరని అన్నారు. కుటుంబ వ్యవస్థలో సమ బాధ్యతలను నిర్వహిస్తారని, అందుకే వారిని ఆకాశంలో సగ భాగం అంటారని గవర్నర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సమానత్వం, సాధికారతకు తెలుగుదేశం కట్టుబడి ఉంటుంది : తెలుగుదేశం అధినేత చంద్రబాబు మహిళలకు అంతార్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎక్కడైతే స్త్రీకి భద్రత, గౌరవం, స్వేచ్ఛ, సాధికారత ఉంటాయో.. అక్కడ సమాజం సంతోషమయం అవుతుందని అన్నారు. మహిళా సమానత్వం కోసం, సాధికారత కోసం తెలుగుదేశం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రగతి పథంలో ముందుకు సాగుతున్న ప్రతి స్త్రీ మూర్తికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

  • ఎక్కడైతే స్త్రీకి భద్రత, గౌరవం, స్వేచ్ఛ, సాధికారత ఉంటాయో ఆ ఇల్లు కానీ, సమాజం కానీ సంతోషమయమవుతుంది. మహిళా సమానత్వం కోసం, సాధికారత కోసం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది తెలుగుదేశం. ప్రగతి పథంలో ముందుకు సాగుతున్న ప్రతి స్త్రీమూర్తికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు#WomensDay

    — N Chandrababu Naidu (@ncbn) March 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఆడపడుచులకు జనసేనాని శుభాకాంక్షలు : జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురష్కరించుకుని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని పవన్​ డిమాండ్​ చేశారు. స్త్రీ మూర్తి సేవలు వెలకట్టలేనివని అన్నారు. స్త్రీలకు సంపూర్ణ సాధికారత సాధించటానికి ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. మహిళలపై అఘాయిత్యాలు జరగని సమాజం కోసం చర్యలు చేపట్టాలని సూచించారు. చట్టసభల్లో మహిళల సంఖ్యాబలం పెరగాలని ఆశించారు.

  • సృష్టిలో సగభాగం మహిళ, ప్రతీ మనిషి జీవితంలో కీలకపాత్ర పోషించే ఆడపడుచులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంపూర్ణ స్త్రీ సాధికారత సాధించాలని ఆకాంక్షిస్తున్నాం.#WomensDay#InternationalWomensDay#womenempowerment pic.twitter.com/45nMfAg6Is

    — JanaSena Party (@JanaSenaParty) March 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

లండన్​లో తెలుగు మహిళల సంబరాలు : లండన్​లో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. లండన్ మహానగరంలో "తెలుగు లేడీస్ ఇన్ యూకే" గ్రూపు ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఆటపాటలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడిచేశారు. ఈ సంబరాలలో యూకేలో ఉన్న 250 పైగా తెలుగు మహిళలు ఒకే చోట చేరి సంబరాలు నిర్వహించారు. ఇలా తెలుగువారు అందరం కలిసి ఒకచోట మహిళా దినోత్సవం జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఒకే వేదికపై అందరూ కలవటం వల్ల దైనందిన జీవితపు అలసటని దూరమైందని.. మరపురాని ఆనందం, ఆహ్లాదం అందిందని మహిళలు తెలిపారు. ఏదేశమేగినా తెలుగువారందరు కలిసిమెలిసి ఉండాలని.. తెలుగు లేడీస్ ఇన్ యూకే సభ్యులు అన్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.