Illegal Sand Mining With Fake Bills in Joint Krishna District: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో గురువారం అర్థరాత్రి సినీఫక్కీలో ఇసుక లారీని మంత్రి జోగిరమేష్ ఎస్కార్ట్ వాహనం వెంబడించి ఢీకొట్టడం కలకలం రేపింది. చెవిటికల్లు నుంచి ఇసుక లోడ్‌తో వస్తున్న లారీ.. ఇబ్రహీంపట్నం మీదుగా విజయవాడ వెళ్తుండగా అక్కడే వేచి ఉన్న మంత్రి జోగి రమేశ్ అనుచరులు ఎస్కార్ట్ వాహనంతో ఐదు కిలోమీటర్లు వరకు వెంబడించారని లారీ డ్రైవర్ తెలిపారు. ఈ క్రమంలో ఎస్కార్ట్ వాహనం లారీని ఢీకొట్టడంతో లారీ డివైడర్ పైకి దూసుకెళ్లిందన్నారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న మాజీమంత్రి దేవినేని ఉమ ఆగి ప్రమాదం గురించి అడిగి తెలుసుకుంటుండగా మంత్రి అనుచరులు అక్కడి నుంచి పారిపోయారు. తర్వాత వేరే పోలీసులు వచ్చి లారీని తొలగించారు.
Sand Mafia in graveyard శ్మశానాన్ని వదలని ఇసుకాసురులు.. అస్తిపంజరాలు బయటపడటంతో భయాందోళనలో ప్రజలు
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇసుక తవ్వకాలకు అనుమతి లేకున్నా..యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారని మాజీమంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. ఇసుక తవ్వకాల్లో మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు, మంత్రి జోగి రమేశ్‌కు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని ఈ నేపథ్యంలోనే మంత్రి అనుచరులు ఏకంగా ఎస్కార్ట్ వాహనంలోనే వెంబడించి ఇసుక లారీని ఆపేందుకు ప్రయత్నించారని ఉమ విమర్శించారు. వాస్తవానికి చెవిటికల్లులో ఇసుక నిల్వ కేంద్రమే లేకున్నా జేపి పవర్ వెంచర్స్ పేరిట ఇసుక బిల్లు ఉందని ఆయన వెల్లడించారు. జేపి పవర్ వెంచర్స్ పేరుతో ఇసుక బిల్లు ఉంది. చెవిటికల్లు నిలువ కేంద్రం నుంచి విక్రయించినట్లు ఉంది. వాస్తవానికి చెవిటికల్లు నిలువ కేంద్రం లేదు. లారీలో దాదాపు 30 టన్నుల వరకు వరకు ఇసుక ఉంది.
Farmer Union Leader Arrested పోలీస్‌స్టేషన్‌లో నాలుగేళ్ల బాలుడు, భార్యతో రైతు సంఘ నేత!
గనుల శాఖ డైరెక్టర్ కార్యాలయానికి ఫిర్యాదు చేసేందుకు మాజీ మంత్రి దేవినేని ఉమా వెళ్లారు. అక్కడ డైరెక్టర్ లేరు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇసుక అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయని దీనికి ప్రత్యక్ష ఉదాహరణ గొల్లపూడి సమీపంలో జాతీయ రహదారిపై పోలీసు ఎస్కార్డు వాహనం వెంబడించి ఢీ కొట్టడమేనని ఆరోపించారు. గనుల శాఖ కార్యాలయంలో కొంత సేపు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. డైరెక్టర్ వచ్చి ఫిర్యాదు తీసుకునేంత వరకు తాను కదిలేది లేదని దేవినేని ఉమా కూర్చున్నారు. ఆయనకు అసిస్టెంట్ డెరెక్టర్ చంద్రశేఖర్ సర్దిచెప్పారు. వేరే సమావేశంలో ఉన్నారని ఆయన వచ్చేందుకు సమయం పడుతుందని వివరించారు. ఫిర్యాదు ఇచ్చి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
దొంగ బిల్లులు, ఓవర్‌లోడ్‌తో వెలుతున్న ఇసుక డబ్బులు తాడేపల్లి ప్యాలెస్‌కు వెళుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇసుక టెండర్ల ప్రక్రియ పూర్తి కాకపోయినా తవ్వకాలు జరిపి పాత సంస్థ పేరుతో అమ్మకాలు చేస్తున్నారని అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని విమర్శిస్తున్నారు. కృష్ణా నదిలో సంపదను దోచుకోమని సీఎం తమ్ముడికి అప్పగించారని అన్నారు. మంత్రి పెద్దిరెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.