AP High Court Comments on Teaching Mother Tongue : మాతృభాషపై పట్టు, విద్యార్ధులకు శిక్షణపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. విద్యార్థులకు బేసిక్‌లైన్ పరీక్షలు నిర్వహించడం లేదని, నిర్వహించినా.. ఫలితాలు ప్రచురించకపోవడంపై హైకోర్టులో ఏలూరుకి చెందిన ప్రొఫెసర్ గుంటుపల్లి శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనివల్ల మాతృభాష రాక రెండో తరగతి పాఠ్యాంశాన్ని ఐదో తరగతి పిల్లవాడు చదవలేక పోతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. మాతృభాషపై పట్టులేకుంటే ఇతర భాషల్లో నైపుణ్యం ఎలా సాధిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. గతంలో మాతృభాష రాకపోతే సిగ్గుపడేవాళ్లు.. ప్రస్తుతం మాతృభాష రాకపోతే గొప్పగా చెప్పుకుంటున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. భవిష్యత్తు తరానికి శిక్షణ ఇలాగే ఇస్తారా అని కోర్టు ప్రశ్నించింది. దీన్ని ప్రభుత్వ వ్యతిరేక వ్యాజ్యంగా భావించవద్దని.. ఈ వ్యవహారం దేశ భవిష్యత్తుతో ముడిపడి ఉందని ధర్మాసనం తెలిపింది. సమస్యను అదిగమించేందుకు మేధావుల సలహాలు తీసుకోమని, విద్యార్థుల్లో మాతృభాష అధ్యయన సామర్థ్యం పెంచేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని విద్యాశాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది.
HC on Mother Tongue: గతంలో మాతృభాష రాకపోతే సిగ్గుపడేవారు.. ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నారు: హైకోర్టు
20:57 July 19
విద్యాశాఖ అధికారులకు హైకోర్టు ఆదేశాలు