Former Minister Narayana : మాజీ మంత్రి నారాయణను ఆయన సతీమణిని ఇంటి వద్దే విచారించాలని హైకోర్టు సీఐడిని ఆదేశించింది. సీఐడి అందించిన నోటీసులపై నారాయణ హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరించింది. మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ నారాయణ తరపున వాదనలు వినిపించారు. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను పరిణగలోకి తీసుకుని మహిళలను ఇంటీ వద్ద విచారించాలన్న విషయాన్ని దమ్మాలపాటి హైకోర్టు ముందుంచారు. గతంలో కూడా ఓ సారి నారాయణను ఇంటి వద్ద విచారించాలని .. కోర్టు ఆదేశాలిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వాదనలు పరిగణలోకి తీసుకున్న హై కోర్టు నారాయణను ఆయన సతీమణి రమాదేవితో పాటు ఉద్యోగి ప్రమీలను ఇంటి వద్దనే విచారించాలని తీర్పు వెలువరించింది.
రాజధాని మాస్టర్ ప్లానింగ్ రూపకల్పనలో, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్ అవకతవకలకు పాల్పడ్డారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో మాజీ మంత్రి నారాయణకు ఆయన సతీమణి రమాదేవికి సీఐడీ నోటిసులు జారీచేసింది. సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ ప్రకారం ఇచ్చిన నోటీసులు.. ఎన్‌ఎస్‌పీఐఆర్‌ఏ ఉద్యోగి ప్రమీలకు సైతం నోటీసులు అందాయి. రామకృష్ణా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అంజీనీకుమార్ అలియాస్ బాబీకీ సైతం నోటిసులిచ్చినా సీఐడీ.. ఈ నెల 6వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. నారాయణ కుమార్తెలిద్దరికే కాకుండా వారి భర్తలకు సైతం సీఆర్‌పీసీ సెక్షన్ 160 ప్రకారం.. నోటీసులు అందించి సాక్షులుగా విచారణకు హాజరు కావాలని తెలిపింది.
గతంలో ఇంటి వద్దనే విచారణ : గతంలో నారాయణను సాక్షిగా విచారణకు రావాలని సీఆర్‌పీసీ సెక్షన్ 160 ప్రకారం సీఐడీ అధికారులు నోటీసులు అందించారు. దీనిపై ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖాలు చేశారు. ఆ సమయంలో అనారోగ్యంతో ఉన్నానని.. వయస్సు 65 ఏళ్లు దాటిందని కోర్టుకు విన్నవించారు. స్పందించిన హైకోర్టు నారాయణను ఆయన నివాసంలోనే.. న్యాయవాది సమక్షంలో విచారించాలని స్పష్టం చేసింది. ఆయన నివాసంలో సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు.
నారాయణపై రాష్ట్రప్రభుత్వం పలు కేసులు నమోదు : గత ప్రభుత్వ హయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణపై పదో తరగతి ప్రశ్న పత్రం లీకేజీ కేసు, ఇప్పుడు నడుస్తున్న రాజధాని మాస్టర్ ప్లానింగ్ రూపకల్పన, ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్ అవకతవకల కేసు, రాజధాని అమరావతి పరిధిలోని అసైన్డ్ భూముల అక్రమ కొనుగోలు అంటూ పలు కేసులు నమోదు చేసింది.
ఇవీ చదవండి :