ETV Bharat / state

ధూళిపాళ్ల నరేంద్రకు హైకోర్టులో ఊరట - హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్‌

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 24, 2023, 4:48 PM IST

HC Grants Anticipatory Bail to Dhulipalla Narendra: హత్యాయత్నం కేసులో టీడీపీ సీనియర్ నేత, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ ఛైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకు హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.

hc_grants_anticipatory_bail_to_dhulipalla

HC Grants Anticipatory Bail to Dhulipalla Narendra: హత్యాయత్నం కేసుకు సంబంధించి.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ ఛైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ నెల 15న సంగం డెయిరీ వద్ద జరిగిన ఘర్షణ విషయంలో చేబ్రోలు పోలీసులు 15 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ధూళిపాళ్ల నరేంద్రను 14వ నిందితుడిగా చేర్చారు. దాంతో ధూళిపాళ్ల నరేంద్ర హైకోర్టును ఆశ్రయించారు. హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. శుక్రవారం ధూళిపాళ్ల నరేంద్ర సహా ఇతరులకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.

అసలు ఏం జరిగిందంటే.. గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ ఛైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌పై ఈ నెల 15వ తేదీన చేబ్రోలు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురానికి చెందిన కొందరు రైతులు.. సంగం డెయిరీ ఆధ్వర్యంలోని పాల కేంద్రానికి పాలు సరఫరా చేశారని, దాని బకాయిలు అడిగేందుకు వారు చేబ్రోలు మండలం వడ్లమూడిలోని డెయిరీ వద్దకు రాగా ఘర్షణ జరిగిందని.. చేబ్రోలు సీఐ తెలిపారు. బాధితుల్లో ఒకరైన రాము ఫిర్యాదు మేరకు 15 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసులో 14వ నిందితుడిగా ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌, 15వ నిందితుడిగా జానకిరామయ్య పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్లు సీఐ వెల్లడించారు. ఈ క్రమంలో కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ధూళిపాళ్ల నరేంద్రతోపాటు ఇతరులకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.

పోలీసులను జగన్ ప్రైవేట్ సైన్యంలా వాడుతున్నారు - భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదు : ధూళిపాళ్ల

Sangam Dairy Employees Stopped Police: గుంటూరు జిల్లా సంగం డెయిరీ వద్ద పోలీసుల హైడ్రామా నడిచింది. ఈ నెల 15న డెయిరీ వద్ద జరిగిన ఘర్షణకు సంబంధించి విచారణ కోసం పోలీసులు లోపలకు వెళ్లేందుకు యత్నించగా ఉద్యోగులు అడ్డుకున్నారు. సెర్చ్ వారెంట్ లేకుండా లోపలకు అనుమతించేది లేదని తేల్చిచెప్పారు. పోలీసులు దౌర్జన్యంగా వెళ్లాలని చూసినా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉండటంతో సాధ్యపడలేదు. దీంతో పోలీసులు వెనుదిరిగారు. అయితే, సంగం డెయిరీని స్వాధీనం చేసుకునేందుకు కుట్ర పన్ని ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని సంస్థ డైరక్టర్లు ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో నరేంద్రను దెబ్బతీయటానికి పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించారని టీడీపీ నాయకులు విమర్శించారు.

Clash Between Dairy Workers, Police: మళ్లీ ఇవాళ ఉదయం 9గంటల సమయంలో చేబ్రోలు, పొన్నూరు పోలీసులు డెయిరీ వద్దకు వచ్చారు. కేసు విచారణ కోసం వచ్చినట్లు చెప్పారు. అనుమతి లేకుండా లోపలకు పంపించలేమని భద్రతా సిబ్బంది స్పష్టం చేశారు. అధికారుల్ని పిలవాలని కోరగా వారు వచ్చారు. నిందితులు డెయిరీలో ఉన్నారని.. తనిఖీలు చేయాలని పోలీసులు చెప్పారు. లోపలికి వచ్చి తనిఖీలు చేయడానికి అనుమతి పత్రం చూపాలని డెయిరీ ఉద్యోగులు కోరగా.. పోలీసులు తిరస్కరించారు. తాము లోపలికి వచ్చే అధికారం ఉందని వాదించారు. కనీసం అదే విషయాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వాలని డెయిరీ ఉద్యోగులు కోరారు. దీంతో డెయిరీ సిబ్బంది పోలీసుల మధ్య దాదాపు రెండు గంటల పాటు వాగ్వివాదం నడిచింది. ఎందుకు వచ్చారో లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని పోలీసులను డెయిరీ సిబ్బంది పట్టుబట్టారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ.. ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు.

Dhulipalla Narendra on Chandrababu Arrest: తప్పు చేసిన ఏ ఒక్క అధికారిని కూడా వదిలిపెట్టం: ధూళిపాళ్ల నరేంద్ర

సంగం డెయిరీ పై ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపింది. కుట్రలో భాగంగానే బయట జరిగిన గొడవకు డెయిరీకి ముడి పెట్టి తప్పుడు కేసులు నమోదు చేశారు. సంగం డెయిరీని స్వాధీనం చేసుకునేందుకు గతంలో వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. అందులో భాగంగానే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేశారు. ఇప్పుడు కూడా తప్పుడు కేసులు పెట్టి, పోలీసులను పంపారు. - ఎన్‌వీకే ప్రసాద్, కంచర్ల శివరామయ్య, సంగం డెయిరీ సంస్థ డైరెక్టర్లు

TDP Leader Dhulipalla Narendra on Sajjala Ramakrishna Reddy: 'సజ్జల తన స్థాయికి మించి మాట్లాడుతున్నాడు..ఎన్నికల ఫలితాల తరువాత మీ బతుకు ఏంటి?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.