Group 1 mains exams will start from tomorrow: రాష్ట్రంలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్న నేపధ్యంలో పరీక్షకు సంబంధించిన వివరాలను ఏపీపీఎస్సీ కార్యదర్శి జె ప్రదీప్ కుమార్ తెలిపారు. శనివారం నుంచి ఈ నెల 10 వరకు 7రోజుల పాటు పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆఫ్‌లైన్‌లో పరీక్ష.. గతంలో ట్యాబ్‌లు ఇచ్చి ఆన్లైన్ ద్వారా పరీక్ష జరపగా.. ఈ సారి దాన్ని తొలగించారు. కేవలం ఆఫ్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. 10 జిల్లాల్లో 11 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఏర్పాట్లతో సహా తీసుకోవాల్సిన చర్యలను.. పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. విజయవాడలో పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. సిబ్బందితో సమావేశమై భద్రత పరంగా, నిర్వహణ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుంది.
ALSO READ: గ్రూప్-1పై సీఎంకు తెలుగు యువత అధ్యక్షుడి లేఖ
బయెమెట్రిక్ యంత్రాలు ఏర్పాటు.. అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. 8 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తామని.. ఆ తరువాత తనిఖీ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. 9 గంటల 45 నిమిషాల వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నట్లు తెలిపారు. పరీక్ష రాస్తోన్న 6 వేల 55 మందికి 70 బయెమెట్రిక్ యంత్రాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తొలిసారిగా ముఖ ఆధారిత గుర్తింపు సహా బయోమెట్రిక్ హాజరును వినియోగిస్తున్నట్లు ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ టీవీలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. పరీక్ష పేపర్ లీకేజీసహా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అభ్యర్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడకుండా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ALSO READ: HC: 'గ్రూప్-1 జవాబు పత్రాలను చేతితో దిద్దించండి'
సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై ప్రశ్నలు: గ్రూప్-1 ఉద్యోగాలకు మొత్తం 1లక్షా 26వేల 449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు.. 2023 జనవరి 8న గ్రూప్ 1 పరీక్షలు జరిగగా అందులో 6 వేల 455 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. ఈ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లా కేంద్రాలు, నగరాలు, పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించారు. ప్రిలిమ్స్ స్క్రీనింగ్ పరీక్షలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం నిర్వహించిన మొదటి పేపర్‌లో.. ఆంధ్రప్రదేశ్ ఎకానమీ విభాగంలో వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్, కౌలు రైతులు, నవరత్నాలు, దిశ యాప్, పోలవరానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు. ఈ సారి పెపర్ ఎలా ఉంటుందోనని అభ్యర్ధులు ఉత్కంఠతో ఉన్నారు.
ALSO READ: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. ఆ పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్