ETV Bharat / state

Employees Representation: జీపీఎస్‌ రద్దు చేసి.. ఓపీఎస్‌ అమలు చేయండి: సీపీఎస్‌ ఉద్యోగులు - GPS cancellation issue updates

GPS cancellation issue updates: జీపీఎస్‌ను రద్దు చేసి దాని స్థానంలో ఓపీఎస్‌ను అమలు చేయాలంటూ రాష్ట్ర సెక్రటేరియట్‌ సీపీఎస్‌ అసోసియేషన్‌ సభ్యులు మంత్రి కొట్టు సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఓపీఎస్​పై నచ్చచెప్పేందుకు ఉద్యోగులు ప్రయత్నించగా.. సీఎం అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారంటూ మంత్రి సమాధానం ఇచ్చారు.

GPS
GPS
author img

By

Published : Jun 27, 2023, 8:42 PM IST

GPS cancellation issue updates: వైఎస్ జగన్ ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు.. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక వారంలోనే సీపీఎస్‌‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు మాట మార్చి జీపీఎస్‌ అంటున్నారని.. ఏపీ సెక్రటేరియట్‌ సీపీఎస్‌ అసోసియేషన్‌ సభ్యులు తాజాగా నిరసనలు, ధర్నాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆనాటి పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీ ప్రకారం.. నేడు పాత పింఛన్‌ విధానాన్ని (ఓపీఎస్‌) వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ.. ఈరోజు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణను కలిసి జీపీఎస్‌ను రద్దు చేయాలంటూ వినతిపత్రాన్ని అందించారు. అనంతరం ఓపీఎస్​పై నచ్చచెప్పేందుకు ఉద్యోగులు ప్రయత్నించగా.. సీఎం అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారంటూ మంత్రి కొట్టు సత్యనారాయణ సమాధానం ఇచ్చారు.

జీపీఎస్‌పై మంత్రి సత్యనారాయణ జోస్యం.. ''ప్రభుత్వం కూలంకషంగా ఆలోచించే ఈ జీపీఎస్ ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఇతర రాష్ట్రాలు కూడా ఈ జీపీఎస్ గురించి ఆలోచిస్తున్నాయి. ఎప్పుడో ఒకప్పుడు ఇతర రాష్ట్రాలు కూడా ఈ జీపీఎస్‌లోకే వస్తాయి'' అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. దీంతో జీపీఎస్ వద్దని సచివాలయ సీపీఎస్ ఉద్యోగులు తేల్చి చెప్పారు. అనంతరం దేశంలోని ఐదు రాష్ట్రాలు ఇప్పటికే ఈ సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో పాత పెన్షన్‌ (ఓపీఎస్) విధానానికి వచ్చాయని ఉద్యోగులు వివరించారు. కొద్దిసేపు మంత్రికి నచ్చచెప్పేందుకు సీపీఎస్ ఉద్యోగులు ప్రయత్నించారు. దీంతో ఉద్యోగుల మాట ఆలకించే ప్రయత్నం చేయకుండా సీఎం జగన్ అన్నీ కూలంకషంగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారంటూ మంత్రి పేర్కొన్నారు. జీపీఎస్ ప్రతిపాదనతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులెవరూ సంతృప్తిగా లేరని.. సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేతలు మంత్రికి తెలియజేశారు.

జీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయండి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో గతంలో ఇచ్చిన హామీ మేరకు తాజాగా ఉద్యోగుల సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి.. దాని స్ధానంలో జీపీఎస్ పేరుతో మరో కొత్త విధానం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ కొత్త విధానం (జీపీఎస్) ద్వారా ఉద్యోగులు సర్వీస్‌లో ఉన్న కాలంలో 10శాతం కాంట్రిబ్యూషన్‌తో పదవీ విరమణ చేసిన తర్వాత పెన్షన్ ఇచ్చేలా ఈ విధానాన్ని రూపొందించినట్లు వెల్లడించింది. అయితే, ఈ కొత్త విధానంపై ఉద్యోగుల్లో అసంతృప్తి మొదలైంది. సీపీఎస్ రద్దు తర్వాత తీసుకొచ్చిన జీపీఎస్ కూడా రద్దు చేయాలంటూ.. తాజాగా ఏపీ సచివాలయ ఉద్యోగులు ధర్నాలు, నిరసనలకు దిగారు.

హామీ ప్రకారమే సీపీఎస్ రద్దు చేశాం.. ఈ నేపథ్యంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి.. దేవాదాయ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. సమావేశం అనంతరం సీపీఎస్‌ అసోసియేషన్‌ సభ్యులు ఆయన కలిసి ఓపీఎస్‌ను అమలు చేయాలని కోరుతూ.. ఓ వినతిపత్రం ఇచ్చారు. స్పందించిన మంత్రి కొట్టు.. వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. జీపీఎస్ తీసుకొచ్చే విషయంలో ప్రభుత్వం చేసిన కసరత్తును వారికి వివరించారు. వైసీపీ హామీ ఇచ్చినట్లుగానే సీపీఎస్ విధానం రద్దు చేశామన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.