Government Land allocation for YCP Office :వైసీపీ కార్యాలయాల నిర్మాణం కోసం 3 జిల్లాల్లో 55 కోట్ల రూపాయల విలువైన 4.75 ఎకరాల భూములను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వైఎస్‌ఆర్, కోనసీమ, అనకాపల్లి జిల్లాల పరిధిలో జాతీయ రహదారుల వెంబడి ముఖ్య కూడళ్లలో ఉన్న భూముల్ని33 ఏళ్లకు లీజుకిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏడాదికి ఎకరానికి వెయ్యి చెల్లించాలని పేర్కొంది. కడపలో కేటాయించిన భూమి మార్కెట్ విలువ రూ.30 కోట్లు, అనకాపల్లి జిల్లా రాజుపాలెంలో 1.75 ఎకరా వైసీపీ కార్యాలయానికి ఇచ్చారు. ఏడాదికి ఎకరానికి వెయ్యి చెల్లించాలని పేర్కొంది. ఈ నెల 20వ తేదీతో జారీ అయిన జీఓలను అధికారులు వెబ్‌సైట్‌లో ఉంచారు. భూముల కేటాయింపుపై ఒక పక్క విమర్శలు వస్తున్నా వైసీపీ ప్రభుత్వం వాటిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పేదలకు చాలీచాలకుండా సెంటు, సెంటున్నర స్థలాన్ని మాత్రమే ఇస్తూ పార్టీ భవనాల కోసం ఎకరాలకు ఎకరాలు కేటాయించడంపై విపక్షాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
ఇవీ చదవండి