ETV Bharat / state

ఎన్టీఆర్​ యూనివర్శిటీ పేరు మార్చటం ముమ్మాటికీ తప్పే: మాజీ హోంమంత్రి వసంత - vasantha nageswara Rao

EX HOME MINISTER VASANTHA : ఎంతో ఘనమైన చరిత్ర గల ఎన్టీఆర్​ హెల్త్​యూనివర్సిటీ పేరు మార్పుపై మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు స్పందించారు. పేరు మార్పు చర్య తప్పేనని పేర్కొన్నారు.

EX HOME MINISTER VASANTHA ON NTR HEALTH UNIVERSITY

author img

By

Published : Nov 21, 2022, 7:22 PM IST

EX HOME MINISTER VASANTHA ON NTR HEALTH UNIVERSITY NAME CHANGE : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చటం తప్పేనని మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు తెలిపారు. మహనీయుడు పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టాల్సిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు. ఆయన పేరు తొలగించి వైఎస్సార్ పేరు పెట్టాలనే ఒత్తిడి ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. ఇది మంచి పద్ధతి కాదని తెలిపారు.

ఎన్టీఆర్ ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదని.. అందరికీ చెందిన మహానాయకుడు అని తెలిపారు. 2019లో జరిగిన ఎన్నికల్లో 35% కమ్మ సామాజికవర్గం వారు వైకాపాకే ఓట్లు వేసి.. జగన్ సీఎం కావటానికి సహకరించారని తెలిపారు. మిగిలిన రాష్ట్రాల్లో కమ్మ సామాజిక వర్గం తక్కువగా ఉన్నప్పటికీ.. అక్కడ మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పించాలని తెలిపారు. రాష్ట్ర ఏర్పడ్డాక.. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో, తమిళనాడుతో కలిసి ఉన్నప్పుడు కూడా కమ్మవారికి మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించారని చెప్పారు. తొలిసారిగా మంత్రివర్గంలో స్థానం లేకపోవడం కరెక్ట్ కాదన్నారు.

ఎన్టీఆర్​ యూనివర్శిటీ పేరు మార్చటం ముమ్మాటికీ తప్పే

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.