ETV Bharat / state

అమ్మాయిల ఫొటో మార్ఫింగ్​ కేసు.. ముగ్గురు నిందితులు అరెస్టు - andhra pradesh news

students photo morphing case accused arrested: ఇంజినీరింగ్ కళాశాల అమ్మాయిల ఫొటోలు మార్ఫింగ్ చేసి.. బెదిరింపులకు పాల్పడటమే కాకుండా.. వారి వ్యక్తిగత డేటా హ్యాక్ చేసి బ్లాక్​మెయిల్​కు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు ప్రదీప్​తో పాటు మరో ఇద్దరిని విజయవాడలో అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.

students photo morphing case
అమ్మాయిల ఫొటోలు మార్ఫింగ్ కేసు
author img

By

Published : Jan 6, 2023, 1:03 PM IST

students photo morphing case accused arrested: అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్​ చేస్తూ విద్యార్థినులను వేధిస్తున్న సైబర్​ నేరగాళ్లను హైదరాబాద్ రాచకొండ సైబర్​ క్రైమ్​​ పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడలో ప్రధాన నిందితుడు ప్రదీప్​తో పాటు మరో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ముగ్గురు విజయవాడకు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు.

రెండు నెలలుగా 8 ఫోన్‌ నెంబర్ల నుంచి అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మేడ్చల్​ జిల్లాలోని ఘట్‌కేసర్‌ మండలం అవుషాపూర్‌లోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థినులు వాపోయారు. ఫోన్‌లో ఉన్న వ్యక్తిగత సమాచారం హ్యాక్ చేస్తున్నట్లు కళాశాల వసతి గృహం వార్డెన్‌కు చెప్పడంతో.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పట్టుకోవాలని కళాశాల ఎదుట విద్యార్థి సంఘాలు కొన్ని రోజుల నుంచి ఆందోళన చేపట్టాయి. ఆందోళన దృష్ట్యా సంక్రాంతి సెలవులను ముందుగానే యాజమాన్యం ప్రకటించింది.

నిందితుడు ప్రదీప్​కుమార్​
నిందితుడు ప్రదీప్​కుమార్​

ఫొటోల మార్ఫింగ్‌తో పాటు ఫోన్‌లో ఉన్న వ్యక్తిగత సమాచారం కూడా హ్యాక్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. నిందితులు తరచూ ఏదో ఒక నంబరుకు కాల్​ చేసి.. అమ్మాయిల గొంతు వినిపించగానే ఆ నంబర్లకు తరచూ ఫోన్ ​చేయడం.. వారితో స్నేహం పెంచుకునేవారని పోలీసులు తెలిపారు. అలా వాట్సాప్​ డీపీలలో ఉన్న అమ్మాయిల ఫోటోలను సేకరించి మార్ఫింగ్​ చేసేవారని వెల్లడించారు. ఈ ముగ్గురు నిందితులు ఇంకా ఎంత మంది అమ్మాయిలను వేధించారన్న విషయాలను రాచకొండ సైబర్​ క్రైమ్​​ పోలీసులు సేకరిస్తున్నారు. అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్​ చేస్తున్నారని గత కొన్ని రోజులుగా ఘట్​కేసర్​లోని ఓ కళాశాల విద్యార్థినులు ఆందోళనలు చేస్తున్నారు. వీరి ఆందోళనల దృష్ట్యా సంక్రాంతి సెలవులను యాజమాన్యం ముందుగానే ప్రకటించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.