ETV Bharat / state

ఆగని అంగన్వాడీల ఆర్తనాదాలు - హామీలు నెరవేర్చే వరకు సమ్మె విరమించబోమని హెచ్చరికలు

Eleventh Day of Anganwadis Strike : డిమాండ్ల సాధనకై రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు పదకొండో రోజు నిరవధిక సమ్మె కొనసాగింది. ప్రధాన రహదారులు, పలు ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసన వ్యక్తం చేశారు. వేతనం పెంపు, గ్రాట్యూటీ, ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ తదితర డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించేంతవరకు సమ్మె విరమించబోమని అంగన్వాడీలు తేల్చి చెప్పారు.

Eleventh_Day_of_Anganwadis_Strike
Eleventh_Day_of_Anganwadis_Strike
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 22, 2023, 9:06 PM IST

Eleventh Day of Anganwadis Strike : డిమాండ్ల సాధనకై రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు పోరాడుతుంటే, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ మీడియా సమావేశం ద్వారా మాట్లాడినటువంటి అంశాలు అంగన్వాడీలకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని శ్రీకాకుళంలో అంగన్వాడీలు తేల్చి చెప్పారు. శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలి వంతెనపై బైఠాయించిన కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

నా అక్కాచెల్లెమ్మలు అంటూ ముద్దులతో ముంచెత్తిన జగన్ హామీలను గాలికొదిలేశారు: అంగన్వాడీలు

Demands of Anganwadis : కోనసీమ జిల్లా పి.గన్నవరంలో అంగన్వాడీలు రాస్తారోకో చేశారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ నినాదాలతో హోరెత్తించారు. అదేవిధంగా విశాఖలో అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనకు తెలుగుదేశం పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీలకు కనీస వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Minister Ushasri Charan Comments on Anganwadi Strike : ఎన్టీఆర్ జిల్లా మైలవరం, కృష్ణా జిల్లా మొవ్వలో అంగన్వాడీలు, C.I.T.U. నాయకులతో కలిసి రాస్తా రోకో నిర్వహించారు. అంగన్వాడీల పట్ల ప్రభుత్వం మెుండి వైఖరి ప్రదర్శిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్వాడీలు నినాదాలు చేశారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. అంగన్వాడీల యూనిఫాం చీరలకు ప్రభుత్వం ఖర్చు చేశామని చెప్పటం విడ్డూరంగా ఉందని అంగన్వాడీలు మండిపడ్డారు. ఒంగోలు సీఐటీయూ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు అంగన్వాడీలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ సెంటర్లో రోడ్డుపై అంగన్వాడీలు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సమస్యలను పరిష్కరించకుంటే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిని గద్దె దింపుతాం: అంగన్వాడీలు

Paritala Sunitha Supports Anganwadis : అనంతపురం జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు వినూత్నంగా నిరసన తెలిపారు. శింగనమల తహశీల్దార్ కార్యాలయం నుంచి ర్యాలీగా బయల్దేరిన అంగన్వాడీలు శింగనమల చెరువులో ఆందోళన చేశారు. అనంతపురం కలెక్టరేట్ సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు మాజీ మంత్రి పరిటాల సునీత సంఘీభావం తెలిపారు. కళ్యాణదుర్గం తహశీల్దార్ కార్యాలయం వద్ద భజన చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంగన్వాడీలు ధర్నా చేశారు. ఉరవకొండ-గుంతకల్లు ప్రధాన రహదారిపై అరగంటపాటు అంగన్వాడీలు రాస్తారోకో నిర్వహించారు.

రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కార్యకర్తల నిరవధిక సమ్మె - మూతపడిన కేంద్రాలు

Anganwadis Strike Across the State : శ్రీ సత్య సాయి, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాలో అంగన్వాడీలు రాస్తారోకోలు నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కడపలోగాంధీ విగ్రహానికి పత్రం ఇస్తామంటూ బయలుదేరిన అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. అంగన్వాడీలు, పోలీసుల మధ్య తోపులాటలు జరిగాయి. అదేవిధంగా కర్నూలు జిల్లాలో శ్రీకృష్ణదేవరాయ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు. దీక్షకు వెళ్తూ రోడ్డు దాటుతున్న అంగన్వాడీలను ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు, మర్రిపాడు వద్ద అంగన్వాడీలు రహదారులు నిర్బంధించి ఆందోళన చేపట్టారు. మర్రిపాడు రహదారిపై మానవహారం నిర్వహించారు. అంగన్వాడీ సిబ్బంది ఆందోళనతో రహదారులపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

వైసీపీ నేతలకు కేకులు, మాకు గడ్డి పోచలా?! - సీఎం జగన్​పై అంగన్వాడీల ఆగ్రహం

ఆగని అంగన్వాడీల ఆర్తనాదాలు - జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు సమ్మె విరమించబోమని హెచ్చరికలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.