ED notices to TRS MLA Pilot Rohit Reddy: తెలంగాణలో తాండూరు శాసనసభ్యుడు పైలట్ రోహిత్ రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ - ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 19వ తేదీన విచారణ హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. రోహిత్ రెడ్డి వ్యాపార, ఆర్థిక లావాదేవీలపై ఈడీ విచారణ జరపనుంది. ఈడీ నుంచి నోటీసులు అందాయని పైలట్ రోహిత్ రెడ్డి నిర్ధారించారు. తన, కుటుంబ సభ్యుల వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు తీసుకురమ్మని అందులో ఉందని, ఏ కేసు అన్న వివరాలు లేవని ఆయన తెలిపారు.
ఇవీ చూడండి: