ETV Bharat / state

Dussehra Sharannavaratri Celebrations: రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు - ఏపీ లేటెస్ట్ న్యూస్

Dussehra Sharannavaratri Celebrations in AP: రాష్ట్ర వ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రుల తొలి రోజు బాలా త్రిపుర సుంద‌రీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు.

Dussehra_Sharannavaratri_Celebrations_in_AP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 15, 2023, 5:19 PM IST

Dussehra Sharannavaratri Celebrations in AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ దంపతులు అమ్మవారిని తొలి దర్శనం చేసుకున్నారు. ఆలయ మర్యాదలతో దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం వేద పండితులు, దేవాదాయ శాఖ కమిషనర్‌ సత్యనారాయణ, ఈవో రామారావు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తదితరులు గవర్నర్‌ దంపతులకు సాదర స్వాగతం పలికారు. నవరాత్రుల తొలి రోజు బాలా త్రిపుర సుంద‌రీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. గవర్నర్‌ దంపతులు అమ్మవారిని దర్శించుకున్న అనంతరం భక్తులకు అవకాశం కల్పించారు.

దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ అమ్మవార్ల ఆలయాల్లో వైభవంగా ప్రారంభమయ్యాయి. ధర్మకర్తలు వంశపారంపర్య ధర్మకర్తల ఆధ్వర్యంలో కలశ స్థాపనతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని ఉండ్రాజవరం గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామ దేవత ముత్యాలమ్మ ఆలయంలో ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ఆలయాన్ని, ముఖ మండపాన్ని, అమ్మవారిని ప్రత్యేక అలంకరించారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ప్రారంభం అనంతరం భక్తుల దర్శనానికి అనుమతించారు.

Dussehra Celebrations Begins at Kanakadurgamma Temple రేపటి నుంచే కనకదుర్గమ్మ దసరా శరన్నవ రాత్రి మహోత్సవాలు..

ప్రకాశం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన త్రిపురాంతకంలోని శ్రీబాలత్రిపుర సుందరీదేవి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 24 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఈదుల చెన్నకేశవరెడ్డి తెలిపారు. 9రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో రోజుకో అలంకరణలో రోజుకొక వాహనంపై అమ్మవారు విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.

పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ అమ్మవార్ల ఆలయాల్లో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తణుకు మండలం మండపాక గ్రామంలో వేంచేసియున్న శ్రీ ఎల్లారమ్మ అమ్మవారి ఆలయంలో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో కలశస్థాపనతో ఉత్సవాలను ప్రారంభించారు. శరన్నవరాత్రుల మొదటి రోజు అమ్మవారిని సర్వాభరణ భూషితురాలిగా తీర్చిదిద్దారు. ఏకవీర దేవి అంశతో వెలసిన అమ్మవారిని శరన్నవరాత్రి రోజుల్లో దర్శించుకుంటే సర్వ శుభాలు జరుగుతాయని భక్తుల అపార నమ్మకం. మహిళలు అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు.

విశాఖ శ్రీ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల చేతులమీదుగా ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. గణపతి పూజతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు అమ్మవారు బాలా త్రిపురసుందరి అవతారంలో దర్శనమిచ్చారు. లోక కల్యాణార్థం శ్రీచక్ర నవావరణార్చన, దేవీ భాగవత పారాయణ చేపట్టారు. సామూహిక కుంకుమార్చనలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Mysore Dasara Festival 2023 : మైసూర్ దసరా ఉత్సవాలు షురూ.. యువరాజు ప్రత్యేక పూజలు

విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో శరన్నవరాత్రుల ఉత్సవాలు సందర్భంగా త్రిపురాంతక స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రులు ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఆలయంలో నిర్వహించిన పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ తొమ్మిది రోజులపాటు రోజుకు ఒక అలంకరణతో అమ్మవారు దర్శన భాగ్యం లభిస్తుందని దేవస్థానం అధికారులు తెలిపారు. మూలా నక్షత్రం రోజున జరిగే పూజల్లో పాల్గొనాలంటే తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలు వైభవంగా ప్రారంభయ్యాయి. ప్రొద్దుటూరు.. దసరా ఉత్సవాల నిర్వహణలో రెండో మైసూరుగా ప్రసిద్ధి చెందింది. 102 మంది కలశాలతో.. మంగళ వాయిద్యాలు.. కోలాట ప్రదర్శనలతో ఊరేగింపు మొదలు పెట్టారు. కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి శివాలయం వరకూ డప్పులు, కోలాటం, నృత్యాలతో సందడి చేశారు. తొమ్మిది రోజులపాటు జరిగే ఉత్సవాలకు ఆలయాల వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాట్లు చేశారు.

అన్నవరం దేవస్థానంలో దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా క్షేత్ర రక్షకులు వన దుర్గ, కనక దుర్గ అమ్మవార్లు.. బాలా త్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. బాపట్ల జిల్లా చీరాల సంతపేటలోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 24 వరకు నవరాత్రి వేడుకలు జరగనున్నాయి. తొలిరోజు 108 కలశాలలో మహిళలు నగరోత్సవం నిర్వహించి కలశాలలో ఉన్న నీటితో అమ్మవారికి జలాభిషేకం నిర్వహించారు. చీరాల పట్టణంలోని ప్రధాన వీధులగుండా సాగిన నగరోత్సవంలో భక్తులు, మహిళలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

Governor Visited Kanaka Durgamma Temple: ఇంద్రకీలాద్రిపై కనులపండువగా దసరా సంబరాలు .. అమ్మవారిని తొలి దర్శనం చేసుకున్న గవర్నర్

నంద్యాల జిల్లాలోని అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల మహా క్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భ్రమరాంబా దేవి ఆలయ ప్రాంగణంలో దేవస్థానం ఈవో డి పెద్దిరాజు, అర్చకులు వేద పండితులు ఉత్సవాలకు అంకురార్పణ పూజలు చేశారు. శివ సంకల్పం, గణపతి పూజ, కుంకుమ పూజ తదితర పూజలతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. పూజా కార్యక్రమాల్లో ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణి రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు. ఈ సాయంత్రం భ్రమరాంబా దేవి భక్తులకు శైలపుత్రి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు. స్వామి అమ్మవార్లకు భృంగి వాహన సేవ జరగనుంది. ఆలయ ప్రాంగణంలో పూజలు నిర్వహించి స్వామి అమ్మవార్లకు పురవీధుల్లో వైభవంగా గ్రామోత్సవం జరుపనున్నారు.

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవాలయంలోని దేవరి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి ఆలయం ఎదురుగా అమ్మవారి బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య అమ్మవారికి పూజలు చేపట్టారు. ఆలయానికి అనుబంధంగా శ్రీ కనకాచలం కొండపై వెలసిన దుర్గాదేవి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ చేెశారు. ఈ విశేష ఉత్సవాన్ని పురస్కరించుకొని స్థానికులతో పాటు బయట ప్రాంతాలకు చెందిన అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

How to do Vahana Pooja : పండగ వేళ వాహన పూజ.. ఇలా చేస్తే గుడిలో చేసినట్టే!

పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో వెలసిన కోటదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలకు బేరి కుటుంబ సభ్యులచే ముహూర్తపు రాట వేసిన అనంతరం నవరాత్రి ఉత్సవాలకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ తొలి పూజల్లో పాల్గొన్నారు. ఆదివారం కావడంతో ఉదయం నుంచి భక్తులు అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. సాయంత్రం నాలుగు గంటల వరకు అమ్మవారి నిజరూపాన్ని 50 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. అమ్మవారిని శాసనసభాపతి తమ్మినేని సీతారాం సతీసమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మురళీకృష్ణ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. డీఎస్పీ జీవీ కృష్ణారావు ఆధ్వర్యంలో 150మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.