ETV Bharat / state

సీఆర్డీఏ అశ్రద్ధ.. ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం మిథ్య - AP CM Jagan mohan reddy

CRDA that does not resolve traffic: రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్​తో సతమతమవుతున్న విజయవాడ వాసుల కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. బండారు రోడ్డు ద్వారా విజయవాడ నుంచి వాహనాలు నగరం బయటకు వెళ్లేందుకు వీలుగా నిర్మించిన పైవంతెన నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోవడమే ట్రాఫిక్ సమస్యకు కారణమవుతోంది. ఏళ్లు గడిచినా తుదిదశ పనులు పూర్తి చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

CRDA
పైవంతెన
author img

By

Published : Feb 24, 2023, 7:51 PM IST

Updated : Feb 25, 2023, 6:19 AM IST

CRDA that does not resolve traffic: రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్​తో సతమతమవుతున్న విజయవాడ వాసుల కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. బందరు రోడ్డు ద్వారా విజయవాడ నుంచి వాహనాలు నగరం బయటకు వెళ్లేందుకు వీలుగా నిర్మించిన పైవంతెన నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయింది. దీని కారణంగా.. ట్రాఫిక్ సమస్యకు మరింతగా పెరిగిపోతున్నాయి. సీఆర్డీఏ అశ్రద్ధ అసాంఘిక శక్తులకు పైవంతెన అడ్డాగా మారడంతో ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా మారింది. పంటకాలువ రోడ్డుకు చివరిలో సిద్ధార్థ కళాశాల వద్ద 400 మీటర్ల పొడవైన పైవంతెనను తక్షణం పూర్తి చేసి ప్రత్యామ్నాయ రహదారిని అందుబాటులోకి తేవడం ద్వారా ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

వాహనదారులకు నిత్యం నరకం..: విజయవాడ నగరంలో ప్రధాన రహదారులపై వాహనదారులు నిత్యం నరకం చూస్తున్నారు. జాతీయరహదారులపై ట్రాఫిక్ ను నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. కోట్ల రూపాయలతో నిర్మించిన పైవంతెన మద్యం సీసాలతో కంపుకొడుతోంది. ఏళ్లు గడిచినా తుదిదశ పనులు పూర్తి చేయలేదు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు నిర్లక్ష్యం వీడి పైవంతెనను అందుబాటులోకి తీసుకురావాలని నగరవాసులు కోరుతున్నారు.

మందుబాబులకు అడ్డాగా పైవంతెన..: కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన పైవంతెన మద్యం సీసాలతో నిండిపోయింది. వంతెనకు ఇరువైపులా మద్యం సీసాలే దర్శనమిస్తున్నాయి. బందరు రోడ్డుపై బెంజిసర్కిల్ నుంచి తాడిగడప వరకూ వాహనదారులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఐదు కిలోమీటర్ల దూరాన్ని దాటేందుకు.. ఉదయం, సాయంత్రం గంటకు పైగానే పడుతోంది. మధ్యలో యూటర్న్​లు, చౌరస్తాలను దాటి వెళ్లడం.. నరకప్రాయంగా మారిపోయింది. ఈ మార్గంలో వాహనదారులు ఇబ్బందులను తొలగించేందుకు ప్రత్యామ్నాయ మార్గం సిద్ధంగా ఉన్నా.. అధికారుల నిర్లక్ష్యపు నీడలు కమ్ముకోవడంతో పనులు సాగడం లేదు. ఈ సమస్యను పూర్తిగా తొలగించేందుకు పక్కా ప్రణాళికతో గత ప్రభుత్వం హయాంలోనే భారీగా ఖర్చుపెట్టి మార్గం సుగమం చేశారు. మూడు కిలోమీటర్లకు పైగా పొడవైన మార్గాన్ని వేశారు. పనులన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయనుకున్న సమయంలో.. ఎన్నికలు రావడం కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో అంతా తారుమారైంది. రూ.3.50-4 కోట్లను ఖర్చు చేస్తే బందరు రోడ్డులో ట్రాఫిక్ సమస్య చాలావరకు తొలగిపోయే అవకాశం ఉంది. వాహనదారుల ఇబ్బందులతో తమకు సంబంధమే లేదన్నట్టుగా ప్రజాప్రతినిధులు, అధికారులు చోద్యం చూస్తున్నారు.

బందరురోడ్డుకు ప్రత్యామ్నాయం ఏదీ?..: విజయవాడ నుంచి పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు,మచిలీపట్నం సహా చాలా ప్రాంతాలకు వెళ్లేందుకు బందరు రోడ్డు ఒక్కటే మార్గం. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు ఈ రహదారిపై రాకపోకలు సాగిస్తుంటాయి. నగరాన్ని.. శివారు ప్రాంతాలతో కలిపే రహదారి కూడా ఇదే కావడంతో.. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, కార్లు, ద్విచక్రవాహనాలు వేల సంఖ్యలో రహదారిపై తిరుగుతుంటాయి. వీటిలో సగం వాహనాలను ఎన్టీఆర్ సర్కిల్ దగ్గరి నుంచి పంటకాలువ రోడ్డులోనికి మళ్లిస్తే.. రద్దీగా ఉండే బందరు రహదారితో సంబంధం లేకుండా నేరుగా తాడిగడప వరకూ వెళ్లిపోతాయి.

తాడిగడపకు లింక్ కలపరా..: దీనికోసమే.. గత ప్రభుత్వంలో పంటకాలువను పూడ్చేసి మరీ రోడ్డును యుద్ధప్రాతిపదికన వేశారు. గతంలో ఆటోనగర్ వరకే పంటకాలువ రోడ్డు ఉండేది. ఈ రహదారిని తాడిగడప వందడుగుల రోడ్డుకు కలపాలని గతంలో ప్రణాళికలు రూపొందించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు.. సీఆర్డీఏ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఆటోనగర్ నుంచి వి. ఆర్. సిద్ధార్థ కళాశాల వరకూ నిరుపయోగంగా ఉన్న పంటకాలువను ఆరు నెలల్లోనే పూడ్చేశారు. ఆ వెంటనే దానిపై రహదారిని సైతం వేసి రెండు వైపులా డ్రైనేజీ కాలవలను ఏర్పాటు చేశారు.

సిద్ధార్థ కళాశాల వద్ద వృథాగా పైవంతెన..: పంటకాలువ రోడ్డుకు చివరిలో సిద్ధార్థ కళాశాల ఉండడంతో 400 మీటర్ల పొడవైన పైవంతెన నిర్మించి.. అవతల వైపు ఉన్న వందడుగుల రోడ్డుకు కలపాలని నిర్ణయించారు. 2018లో దీనికోసం సిద్ధార్థ అకాడమీ, సీఆర్డీఏ మధ్య ఒప్పందం కుదిరింది. సిద్ధార్థ అకాడమీ నిధులతో పైవంతెనను నిర్మించాలని, దానిపై సౌండ్ బారియర్స్, కింది భాగంలో డ్రైనేజీ కాలువలను సీఆర్డీఏ ఏర్పాటు చేయాలని ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం.. రూ.11 కోట్లను ఖర్చు పెట్టి సిద్ధార్థ అకాడమీ ఆధ్వర్యంలో పైవంతెనను కేవలం ఏడాదిలోనే పూర్తిచేశారు. 2019లో పనులన్నీ పూర్తిచేసి సీఆర్డీఏకు పైవంతెనను అప్పగించారు. అప్పటి నుంచి గత మూడున్నరేళ్లుగా సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం చేపట్టాల్సిన పనులను చేయకుండా వదిలేసింది.

సీఆర్డీఏ వద్ద రూ.4 కోట్లు లేవా?..: కేవలం రూ.3.50కోట్ల నుంచి రూ.4 కోట్లతో చేపట్టాల్సిన పనులకు కూడా డబ్బులు లేవంటూ సీఆర్డీఏ అధికారులు చేతులెత్తేశారు. 400 మీటర్ల వంతెనపై సౌండ్ బారియర్స్ ను ఏర్పాటు చేసేందుకు రూ. కోటి వరకూ ఖర్చవుతుంది. పైవంతెన కింది భాగం నుంచి డ్రైనేజీ కాలువలను రెండు వైపులా కలిపి 800మీటర్ల పొడవులో నిర్మించాలి. దీనికి మరో రూ.2.50 కోట్ల నుంచి రూ.3 కోట్లు అవుతుంది. ఈ చిన్న పనులకు కూడా డబ్బులు లేవంటూ సీఆర్డీఏ అధికారులు తిప్పుతున్నారు. దీంతో ఈ మార్గంలో వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెనమలూరు పీఎస్ పక్కనే ఉన్న ఈ పైవంతెన మందుబాబులకు అడ్డాగా మారుతుందనటానికి మద్యం సీసాలే నిదర్శనమని నగరవాసులు ఆవేదనతో చెబుతున్నారు.

ఇవీ చదవండి

Last Updated : Feb 25, 2023, 6:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.