CPI Ramakrishna Comments On Central Budget: కేంద్ర బడ్జెట్లో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన, రైతులకు సబ్సిడీ, ధరల నియంత్రణ లేకుండా కేవలం సంపన్న వర్గాలకే పెద్దపీట వేయడాన్ని నిరసిస్తూ ఈనెల 10వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ వెల్లడించారు. సీపీఐ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా ఈ నిరసనలు జరుగుతాయని అన్నారు.
విజయవాడ దాసరిభవన్లో రామకృష్ణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదానీకి అప్పనంగా దోచిపెడుతున్నాయనీ, అన్ని విధాలా ఆయనకు సహకరిస్తున్నాయని మండిపడ్డారు. ఆదానీ అవినీతిపై తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టాలని, ప్రదాని మోదీ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పేదలకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. కనీసం పేదలకు ఒక్క గూడు కట్టి ఇవ్వలేకపోయారన్నారు. పూర్తైన టిడ్కో గృహాలను లబ్దిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 6వ తేదీన జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.
ఇవీ చదవండి: