ETV Bharat / state

CPI leaders on Alliance: బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిస్తే.. ఎవరికీ లాభం..?: సీపీఐ నేతలు

CPI Narayana and Ramakrishna sensational comments on party alliances: బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ పొత్తులపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి గెలించేందుకే ముచ్చటగా మూడోసారి మచిలీపట్నం పోర్టుకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారని ఎద్దేవా చేశారు.

CPI Narayana
CPI Narayana
author img

By

Published : May 22, 2023, 7:50 PM IST

CPI Narayana and Ramakrishna sensational comments on party alliances: ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో 2024లో జరగబోయే సాధారణ ఎన్నికలకు సంబంధించి.. సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ), తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)కే లాభం చేకూరుతుందని వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీ వ్యతిరేక ఓటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకీ పడటంతో.. మళ్లీ వైఎస్ జగనే విజయం సాధించే అవకాశం మెండుగా ఉంటుందన్నారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి గెలించేందుకే ముచ్చటగా మూడోసారి మచిలీపట్నం పోర్టుకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారని ఎద్దేవా చేశారు.

బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిస్తే ఎవరికీ లాభం..?

వివరాల్లోకి వెళ్తే.. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ పొత్తులపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలు వారి వారి అభిప్రాయాలను వెల్లడించారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ మీడియాతో మాట్లాడుతూ..''రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తే అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే లాభం చేకూర్చినట్టు అవుతుంది. ఈ కూటమి వచ్చినా రాష్ట్రంలో ఎటువంటి లాభం ఉండదు. బీజేపీ వ్యతిరేక ఓటు వైసీపీకి పడుతుంది.. అప్పుడు మళ్లీ జగనే గెలుస్తారు'' అని ఆయన అన్నారు.

2024 ఎన్నికల్లో మరోసారి గెలిచేందుకే సీఎం జగన్ మోహన్ రెడ్డి ముచ్చటగా మూడోసారి మచిలీపట్నం పోర్టుకు శంకుస్థాపన చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. స్వాతంత్య్రం వచ్చాక సుదీర్ఘ కాలం బెయిల్​పై ఎవరైనా ఉన్నారా..? అంటే అది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని విమర్శించారు. బీజేపీ మద్దతు లేకుండా సుదీర్ఘ కాలం బెయిల్​, హత్యలు చేసిన అరెస్ట్ అవ్వకుండా తిరగడం సాధ్యం కాదని ఆయన దుయ్యబట్టారు.

అనంతరం ముఖ్యమంత్రి జగన్ అవినీతి పాలనపై విస్తృతమైన చర్చ జరగాలని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి వివేకానందా రెడ్డిని ఎవరు చంపారు..? అనే విషయాన్ని రాష్ట్రంలోని ఏ చిన్న పిల్లవాడిని అడిగినా ఇట్టే చెప్తారన్నారు. కానీ, వివేకా హత్య కేసుకు సంబంధించి.. ఆయనను (వివేకా) ఎవరు చంపారు అనే విషయం మాత్రం ఐపీఎస్ చదివినా సీబీఐ ఆఫీసర్లకు నాలుగు సంవత్సరాలు గడిచినా తెలియలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ దిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో కలిసి సీబీఐని ఆటలాడిస్తున్నారని సీపీఐ రామకృష్ణ ఆరోపించారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.