ETV Bharat / state

ప్రభుత్వ విధానాలతో.. కృష్ణాజిల్లాలో భారీగా ఇటుక బట్టీల మూత - AP headlines

Troubles of brick kilns: సుబ్బి పెళ్ళి..వెంకి చావుకొచ్చిందన్నట్లుంది.. ఇటుకల బట్టీల కార్మికులు పరిస్థితి. పేదరిక నిర్మూలనే తమ విధానాలంటున్న ప్రభుత్వాలే..పేదోడి నడ్డివిరిస్తున్నాయి. అభివృద్ది పనులకు ప్రభుత్వం పులుస్టాపు పెట్టడంతో.. నిర్మాణ రంగం పూర్తిగా కుంటుపడిన సంగతి తెలిసిందే. తాజాగా ఇటుకలు తయారు చేసే కార్మికులు, ఇక మా వల్ల కాదంటూ.. బట్టీలను మూసేస్తున్నారు. ఈనాడు-ఈటీవీ పరిశీలను కృష్ణా జిల్లాలో భారీగా ఇటుక బట్టీలు మూతపడ్డాయని వెల్లడైంది.

Troubles of brick kilns
పెరిగిన ధరల వల్ల అగమ్యగోచరంగా ఇటుకల బట్టీ కార్మికులు పరిస్థితి
author img

By

Published : Jan 9, 2023, 2:27 PM IST

Troubles of brick kilns: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన ఇసుక పాలసీ పేరుతో దాదాపు రెండేళ్లు ఇసుక సరఫరాకు అటంకం కల్పించడంతో భవన నిర్మాణ రంగం కుదేలైంది. మరోవైపు సిమెంట్, ఐరన్ ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య ప్రజలు ఇళ్ల నిర్మాణాలకు దూరంగా ఉన్నారు. ప్రభుత్వం జగనన్న కాలనీను నిర్మిస్తామని చెప్పడంతో నిర్మాణ రంగంతో కొంత ఉత్సాహం కనిపించినా ప్రభుత్వ తీరుతో ఇళ్ల నిర్మాణం నత్తతో పొటి పడుతోందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రధానంగా ఇటుకల బట్టీల నిర్వాహకులు ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. దాదాపు 25 సంవత్సరాల నుంచి ఇటుకల బట్టీలను నిర్వహిస్తున్నామని, ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదని ఇటుకల బట్టీల నిర్వహకులు చెబుతున్నారు.

మిర్యాలగూడ, దావులూరు, తెలంగాణ నుంచి ఇటుకల తయారీకి మసీని తీసుకొస్తున్నాం... ముడి సరుకు రేట్లు, కూలీల రేట్లు పెరుగుతున్నా ఇటుకల రేటు మాత్రం పెరగడం లేదని నిర్వాహకులు వాపోతున్నారు. ఉమ్మడి కృష్ణజిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో ఇటుకల బట్టీలు ఉండేవని ఇప్పుడు 500లోపు మాత్రమే ఇటుకల బట్టీలు ఉన్నాయని వారు పెర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం నిర్మిస్తున్న జగనన్న ఇళ్లతో అయినా ఆర్థిక కష్టాలు తీరుతాయని భావించగా ఆ ఇళ్లు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండటంతో వారు నిరాశకు గురవుతున్నారు.

ప్రభుత్వం ఇస్తున్న లక్ష 80 వేలు సరిపోకపోవడంతో అప్పులు తీసుకువచ్చే ఆర్థిక స్తోమత లేక చాలామంది ఇంటి నిర్మాణాలను నిలిపివేశారు. ఇంటి నిర్మాణాలు జరిగితే ఇటుకలను కొనుగోలు చేస్తారని దానివల్ల తమకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని నిర్వహకులు చెప్తున్నారు. ఇటుకలు తయారు చేయాలంటే లక్షలు ఖర్చు చేయాల్సి ఉందని పెర్కొన్నారు. ఇటుకల బట్టీలో ప్రస్తుతం ఒక మనిషి రోజు కూలీ 500 నుంచి 600 వరకు ఉందని, ఇక్కడ కూలీల భారాన్ని తట్టుకోలేకపోతున్నామని వారు వాపోతున్నారు. ఇటుకలు తయారు చేసేందుకు ఒరిస్సా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి కూలీలను తీసుకువస్తున్నామన్నారు.

ఇటుకల వ్యాపారం లేకపోవడంతో తీసుకువచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయని నిర్వహకులు వాపోతున్నారు. కుటుంబ సభ్యుల బంగారు నగలు తాకట్టు పెట్టి అప్పులు కడుతున్నామని అవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ రంగాన్ని నమ్ముకుని ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది జీవిస్తున్నారని వివరించారు. నిరంతరాయంగా ఇసుకను సరఫరా చేస్తే నిర్మాణాలు చేసేందుకు ప్రజలు మందుకు వస్తారు కాని పరిస్థితులు ఇలాగే ఉంటే ఇటుకల బట్టీల పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఉందన్నారు. గతంలో అనేక రకాల రుపాల్లో ఇటుకలను తయారు చేసే వాళ్లమని, పెరిగిన ధరలతో ఇప్పుడు ఒకేలా చేస్తున్నామని చెప్పారు. తరతరాలుగా వస్తున్న వృత్తిని నమ్ముకున్న కార్మికులకు ఆ వృత్తి అన్నం పెట్టకపోగా, అప్పులు పాలు చేస్తోందని వాపోయారు.

''లారీ మసి 10 వేల లోపు ఉండేది ఇప్పుడు 25 నుంచి 30 వేలకు చేరింది ముడి సరుకుతో పాటు పెట్రోల్, డిజీల ధరలు పెరగడం వల్ల రవాణ చార్జీలు కూడా పెరిగడం వల్ల ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటున్నాము''- పాండు రంగరావు, ఇటుకల బట్టీ యజమాని

''గతంలో టన్ను ఊక 1000 రుపాయల నుంచి 1500 వరకు ఉంది ఇప్పుడు అదే ఊక టన్ను 5 వేల రుపాయలకు పెరిగింది. ప్రతి వస్తువు రేటు పెరుగుతుంది కానీ ఇటుకల రేటు మాత్రం పెరగడం లేదు''- నాగేశ్వరరావు, ఇటుకల బట్టీ యజమాని

పెరిగిన ధరల వల్ల అగమ్యగోచరంగా ఇటుకల బట్టీ కార్మికులు పరిస్థితి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.