ETV Bharat / state

అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో.. మూడోరోజు యథేచ్ఛగా కోడి పందేలు - Telangana Kodada MLA Bollam Mallaiah Yadav

Cock fight in state: రాష్ట్రంలో కోడి పందేలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలకు పందెం రాయుళ్లు భారీగా తరలి వస్తున్నారు. కోడి పందేలతోపాటు మద్యం అక్రమ అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. పోలీసు యంత్రాంగం మాత్రం ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది.

Cock fight in state
అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో.. మూడోరోజు యదేచ్ఛగా కోడి పందాలు
author img

By

Published : Jan 16, 2023, 8:02 PM IST

Updated : Jan 17, 2023, 6:30 AM IST

తాడేపల్లిలోని రాజకీయ పలుకుబడితో రాష్ట్రస్థాయిలో కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం నీలపల్లి వద్ద ఏర్పాటుచేసిన కోడిపందేల బరి మూడో రోజు పందెం రాయుళ్లతో తిరుణాళ్లను తలపించింది.. హైటెక్ హంగులు.. ప్రత్యేక సెక్యూరిటీ సిబ్బంది.. బౌన్సర్లు.. ప్రవేశానికి ప్రత్యేక రుసుము.. వారికి ప్రత్యేక గుర్తింపు ట్యాగ్.. పందేలు తిలకించేందుకు వచ్చే అతిథులకు ప్రత్యేక గ్యాలరీ, విందు భోజనాలు.. ఇలా అంతా ఒక పద్ధతి ప్రకారం ఈ మూడు రోజులపాటు నిర్వహించారు.. చివరి రోజు ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రావడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.. నిర్వాహకులు ఆయనకు సాదర స్వాగతం పలికి.. బరిలో పోటీ పడుతున్న పందెం రాయుళ్లును పరిచయం చేశారు.. ప్రత్యేక గ్యాలరీలో కూర్చుని కోడిపందాలు వీక్షించారు.. నిమిషాలు వ్యవధిలోనే లక్షలాది రూపాయలు చేతులు మారాయి.. డబ్బులు లెక్కించేందుకు ఇక్కడ ప్రత్యేక కౌంటర్లు ..మిషన్లను కూడా ఏర్పాటు చేశారు.. ఐదు ఎకరాలు విస్తీర్ణంలో కార్ల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు..

  • కృష్ణాజిల్లాలో

కృష్ణాజిల్లా కూచిపూడి పామర్రు నియోజకవర్గంలో ఆకాశమే హద్దుగా జూద క్రీడలు జరుగుతున్నాయి. సంక్రాంతి పండగ ముసుగులో విచ్చలవిడిగా జూదం నిర్వహిస్తున్నారు. కోడి పందేలు, పేకాట, గుండాటలు యథేచ్ఛగా సాగుతున్నాయి. స్టషన్ల వారీగా మామూళ్లు చెల్లించామని నిర్వాహకులు చెబుతున్నారు. మొవ్వ మండలంలోని కూచిపూడిలోని బరివద్ద నూతన క్రీడలను ప్రవేశపెట్టి నిర్వహకులు దోపిడీ చేస్తున్నారు. కొన్ని బరులకు పందెం రాయుళ్లు, పేకాట రాయుళ్లు భారీగా రావడంతో బరుల నిర్వాహకులు అదనంగా మరో రోజు నిర్వహించేందుకు అనుమతి కోరేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం.

అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో.. మూడోరోజు యథేచ్ఛగా కోడి పందేలు
  • ఎన్టీఆర్ జిల్లా

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు మండలాల్లో కోడిపందేల యథేచ్ఛగా సాగుతున్నాయి. పెనుగంచిప్రోలులో కోడి పందేల వద్దకు తెలంగాణ రాష్ట్రం కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తన అనుచరులతో కలిసి వచ్చారు. ఆయనకు నిర్వాహకులు స్వాగతం పలికారు. సూర్యాపేట జిల్లా పోలీసులు పోలీస్ వాహనంతో ఆయనకు ఎస్కార్ట్ గా వచ్చారు. పోలీస్ వాహనాన్ని చూసిన ప్రజలు పోలీసులు వచ్చారని పరుగులు తీశారు. బరిలోకి వచ్చిన ఎమ్మెల్యే ఒక పందానికి పై పందెంగా 20 వేలు పెట్టి గెలుపొందారు. అనంతరం తనతో తెచ్చుకున్న మధ్యాహ్నం భోజనాన్ని అక్కడే చేశారు. పెనుగంచిప్రోలు ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్​లో జరుగుతున్న జూదాన్ని పోలీసులు ఆకస్మికంగా దాడి చేసి అడ్డుకున్నారు.

తిరువూరు ఆర్డీవో కార్యాలయం పక్కనే జరుగుతున్న కోడిపందేల బరి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పందెం విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. దీంతో ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నారు. పెద్దలు సర్ధిచెప్పడంతో వివాదం ముగిసింది. దీంతో ఓ వర్గం పందేలు నిలిపివేసి బరి బయటకు వెళ్లిపోయారు. నియోజకవర్గంలో కోడిపందేల బరుల వద్ద గుండాట, పేకాట, కోసు వంటి జూదాలు యధేచ్ఛగా కొనసాగుతున్నాయి. పందేల రూపంలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఉదయం కాసేపు హడావుడి చేసిన పోలీసులు అనంతరం చేతులు దులుపుకున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 17, 2023, 6:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.