ETV Bharat / state

మెట్రో రైలు రెండో విడత పనులకు ముహూర్తం ఫిక్స్ - Hyderabad Second Phase Metro Works

Hyderabad Second Phase Metro Works: హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 9వ తేదీన హైదరాబాద్ మెట్రో రైలు రెండో ఫేజ్ పనులకు సీఎం కేసీఆర్ భూమిపూజ చేయనున్నారు. మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్​పోర్ట్ వరకు 31 కిలో మీటర్ల మెట్రో రైలు పనులు చేపట్టనున్నారు. మొత్తం 6250 కోట్ల రూపాయలతో ఎయిర్​పోర్ట్​ వరకు మెట్రో పనులు విస్తరించనున్నట్లు మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా వెల్లడించారు.

metro 2nd phase
metro 2nd phase
author img

By

Published : Nov 27, 2022, 5:33 PM IST

Hyderabad Second Phase Metro Works: హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 9 తేదీన హైదరాబాద్ మెట్రో రైలు రెండో ఫేజ్ పనులకు సీఎం కేసీఆర్ భూమిపూజ చేయనున్నారు. మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్​పోర్ట్ వరకు 31 కిలో మీటర్ల మెట్రో రైలు పనులు చేపట్టనున్నారు. మొత్తం 6250 కోట్ల రూపాయలతో ఎయిర్​పోర్ట్​ వరకు మెట్రో పనులు విస్తరించనున్నట్లు మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. కేటీఆర్ ట్వీట్‌పై మజ్లిస్​ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఎంజీబీఎస్-ఫలక్‌నుమా కారిడార్-2 పనులు ప్రారంభించాలని కోరారు. 5.5 కి.మీ దూరం ఉన్న ఈ కారిడార్‌కు రూ.500 కోట్లు కేటాయించారని తెలిపారు. పరిసర ప్రాంతాల యువత హైటెక్ సిటీ వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గమని ఓవైసీ పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో మెట్రో విస్తరణకు నవంబరులోనే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరిప్రీత్‌ సింగ్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. మెట్రో పనులకు నిధులు కేటాయించాలని కోరారు. మరోవైపు కేంద్రం నిధులు సమకూర్చినా, సమకూర్చలేకపోయినా మెట్రో విస్తరణ పనులు చేపడతామని కూడా ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మెట్రో రైలు రెండో ఫేజ్‌ పనులకు డిసెంబరు 9న భూమిపూజ చేయనున్నట్లు వెల్లడించారు. అయితే, మెట్రో నిర్మాణ పనులకు సంబంధించి ప్రభుత్వమే మొత్తం ఖర్చు భరిస్తోందా? గతంలో మాదిరి పీపీపీ మోడల్‌లో చేపడుతోందా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.

అదేవిధంగా బీహెచ్‌ఎల్‌ నుంచి లక్డీకాపూల్‌ వరకు మెట్రో మార్గాన్ని నిర్మించాలని ఇటీవలే నిర్ణయించారు. దీన్ని కూడా ఇందులో భాగంగా చేపడతారా? అనేది తెలియాల్సి ఉంది. ఎల్‌బీనగర్‌ నుంచి నాగోల్‌ వరకు మిగిలిపోయిన మెట్రో మార్గాన్ని కూడా ఇందులోనే చేరుస్తారా? దీనికి కూడా భూమిపూజ ఆ రోజే చేస్తారా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. హైదరాబాద్‌ మెట్రోలో కరోనా ముందు వరకు దాదాపు 5 లక్షల మంది ప్రయాణించగా.. ప్రస్తుతం ఆ సంఖ్య సుమారు 4లక్షలుగా ఉంది. క్రమక్రమంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో విస్తరణ జరిగినట్లయితే ఇంకా ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దీంతోపాటు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ కూడా తగ్గొచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

KCR will perform Bhumi Puja for the second phase of Hyderabad Metro Rail works
కేటీఆర్​ ట్వీట్​

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.