ETV Bharat / state

గణాంకాలు, హెచ్చరికలు లేవు.. మారిన సీఎం జగన్​ స్వరం - ysrcp

CM Meeting with MLA's : ఎమ్మెల్యేలతో సమావేశం అనగానే గాంభీర్యం ప్రదర్శించే ముఖ్యమంత్రి జగన్‌.. తాజా భేటీలో మాత్రం గణాంకాలు చదివి వినిపించలేదు. హెచ్చరికల జోలికి పోలేదు. మీ పనితీరును మార్చుకోకపోతే టికెట్లు ఇవ్వబోను అనే హుంకారాలూ అసలు లేనేలేవు.. పైగా ఏ ఎమ్మెల్యేనూ వదులుకోను.. కార్యకర్తనూ పోగొట్టుకోవాలని అనుకోను.. రాజకీయాలంటే మానవ సంబంధాలని నాన్న నుంచి నేర్చుకున్నానంటూ కొత్త పల్లవి అందుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వంపై సోమవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరు చూసి పలువురు ఎమ్మెల్యేలు బయటకొచ్చాక ‘ఈ హఠాత్పరిణామమేంటో’ అని చర్చించుకున్నారు.

CM Jagan
సీఎం జగన్​
author img

By

Published : Apr 4, 2023, 8:10 AM IST

స్వరం మార్చిన సీఎం జగన్‌

CM Jagan Meeting with MLAs : 'ఏ ఒక్క ఎమ్మెల్యేను పొగొట్టుకోవాలని నేను ఎప్పుడు అనుకోను.. మీ అందర్ని పిలిపించి ఎందుకు చెప్తున్నాను అంటే.. మీతో పని చేయింటం కోసం... మీరు మళ్లీ గెలిచి రావాలనే తాపత్రయంతో చేస్తున్నాను... ప్రజల్లో మన గ్రాఫ్​ సరిగా లేకపోతే.. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను బటన్లు నొక్కడం ఆపకూడదు... మీరు తిరగటం ఆపకూడదు... తిరగటం మీరు చేయాల్సిన పని.. రెండు కలిసి ఒకటైతే.. 175కి 175 కొడతామన్నది వాస్తవం' అని సీఎం జగన్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీనికి కారణం.. గతేడాది మే నెలలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై సీఎం సమీక్షించినప్పుడల్లా దాని పురోగతిపై ఏ ఎమ్మెల్యే ఎలా తిరిగారనే పూర్తి వివరాలతో చర్చించేవారు.

‘మీరు అసలు తిరగలేదు. 5 రోజుల్లోపు తిరిగారు. 10నుంచి 15 రోజులే తిరిగారు. మీరు బాగానే తిరిగారు. చెప్పినంత సమయాన్ని పాటించలేదు’ అంటూ విభాగాలవారీగా ప్రతి ఎమ్మెల్యే పనితీరును లెక్కలు గట్టి మరీ అందరిముందే ప్రకటించేవారు. వెనుకబడినవారి పేర్లనూ చదివేవారు. ఫిబ్రవరి 13న నిర్వహించిన సమీక్షలోనూ కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు ఇలాగే ప్రకటించారు. వారి పనితీరు మెరుగుపరచుకోవాలని సీఎం హెచ్చరించారు. పనితీరులో మార్పులు లేని, మెరుగుపరచుకోని ఎమ్మెల్యేల స్థానంలో మే నెల తర్వాత కొత్త నియోజకవర్గ సమన్వయకర్తల నియామకం ఉంటుందని గతంలోనే ముఖ్యమంత్రి ప్రకటించారు.

సోమవారం నిర్వహించిన సమావేశంలో కూడా గతంలోలాగే ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు సిద్ధం చేశారనే వార్తలొచ్చాయి. ఈ క్రమంలో పార్టీలో ఎవరి పరిస్థితి ఏంటో అనే సందిగ్ధంలోనే ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు సమావేశానికి వెళ్లారు. అయితే వారు ఊహించినదానికి భిన్నంగా సీఎం ప్రసంగం సాగింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం, ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలు కొందరు తిరుగుబాటు చేసిన నేపథ్యంలోనే సీఎం ‘రాజకీయమంటే మానవ సంబంధాలు’ అనే కొత్త ఫిలాసఫీ చెబుతున్నారన్న చర్చకు దారితీసింది. గడపగడపకూ కార్యక్రమాన్ని రెట్టించిన ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాలని జగన్‌ ఎమ్మెల్యేలకు సూచించారు.ఈ నెల 13న ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం ప్రారంభిస్తున్నామన్న ఆయన.. వ్యక్తుల సమస్యలపై వారి వినతులను పరిష్కరించేలా ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. సమస్యలు నేరుగా తనకే ఫోన్‌ చేసి చెప్పొచ్చు అంటూ చెప్పుకొచ్చారు. ‘జగనన్నే మన భవిష్యత్తు’ కార్యక్రమం ఈ నెల 7 నుంచి 20 వరకు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.

"జగనన్నకు చెబుదాం అనే కొత్త కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఎవరికి ఏ సమస్య ఉన్న నేరుగా నాకే ఫోన్​ చేసి చెప్పవచ్చు. నేరుగా సీఎంవోనే సమస్యను పరిష్కరిస్తుంది. ఎవరికి ఏ సమస్య ఉన్న ఈ కార్యక్రమం ద్వారా పరిష్కరిస్తాము." -జగన్​మోహన్​ రెడ్డి, ముఖ్యమంత్రి

"జగనన్నే మా భవిష్యత్​ అనే కార్యక్రమం రాష్ట్రంలో ఉన్న 15 వేల సచివాలయాల్లో.. డోర్​ టూ డోర్​ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించబోతున్నాం." - అప్పలరాజు, మంత్రి

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.