ETV Bharat / state

ప్రభుత్వ ఇనుప పాదాల కింద బడుగులు నలిగిపోకుండా కాపాడేదే రాజ్యాంగం: సీఎం - విజయవాడలో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం

CM And Governor At Constitution Day Program: రాజ్యాంగమే.. మన సంఘ సంస్కర్త అని సీఎం జగన్​ తెలిపారు. ప్రభుత్వ ఇనుప పాదాల కింద బడుగులు నలిగిపోకుండా కాపాడేదే రాజ్యాంగం అని వ్యాఖ్యానించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

CM And Governor At Constitution Day Program

author img

By

Published : Nov 26, 2022, 1:59 PM IST

Updated : Nov 26, 2022, 10:09 PM IST

ప్రభుత్వ ఇనుప పాదాల కింద బడుగులు నలిగిపోకుండా కాపాడేదే రాజ్యాంగం

CM JAGAN AT CONSTITUTION DAY : క్రమశిక్షణ నేర్పే రూల్‌బుక్, సామాజిక ప్రతీక.. రాజ్యాంగం అని సీఎం పేర్కొన్నారు. బడుగులు, నిస్సహాయుల రక్షణకు దేవుడిచ్చిన ఆయుధం.. రాజ్యాంగం అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్​, సీఎం జగన్ పాల్గొన్నారు.

గ్రామసచివాలయల ద్వారా గ్రామ స్వరాజ్యం: ప్రభుత్వ ఇనుప పాదాల కింద బడుగులు నలిగిపోకుండా కాపాడేదే రాజ్యాంగం అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగమే.. మన సంఘ సంస్కర్త అని తెలిపారు. వచ్చే ఏప్రిల్‌లో విజయవాడలో అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ చేస్తున్నట్లు తెలిపారు. గ్రామసచివాలయల ద్వారా గ్రామ స్వరాజ్యం సాధించామన్నారు. మహిళల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి తమ ప్రభుత్వం తోడ్పాటు అందించినట్లు తెలిపారు. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ప్రజలకు రూ.3.8 లక్షల కోట్లు అందించామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

"క్రమశిక్షణ నేర్పే రూల్‌బుక్, సామాజిక ప్రతీక.. రాజ్యాంగం. బడుగులు, నిస్సహాయుల రక్షణకు దేవుడిచ్చిన ఆయుధం.. రాజ్యాంగం. ప్రభుత్వ ఇనుప పాదాల కింద బడుగులు నలిగిపోకుండా కాపాడేదే రాజ్యాంగం. రాజ్యాంగమే.. మన సంఘ సంస్కర్త. వచ్చే ఏప్రిల్‌లో విజయవాడలో అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ. గ్రామసచివాలయల ద్వారా గ్రామ స్వరాజ్యం సాధించాం"-సీఎం జగన్​

రాష్ట్రంలో సామాజిక న్యాయం: వైకాపా ప్రభుత్వంలో సామాజిక న్యాయం అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. సభాపతిగా బీసీ వ్యక్తిని నియమించామన్నారు. 80 శాతం మంత్రి పదవులు వెనుకబడిన వర్గాలకే ఇచ్చామని పేర్కొన్నారు. జడ్పీలు, పురపాలికలు, నగరపాలికల్లో వెనుకబడిన వర్గాలకే ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తిని కచ్చితంగా పాటిస్తున్నామని వ్యాఖ్యానించారు.

ప్రజాస్వామ్యం.. ప్రపంచానికి దిక్సూచి: రాజ్యాంగ రూపకర్తల కృషిని దేశ ప్రజలు గుర్తుంచుకుంటారని గవర్నర్‌ బిశ్వభూషణ్​ హరిచందన్​ అన్నారు. మన ప్రజాస్వామ్యం.. ప్రపంచానికి దిక్సూచి అని తెలిపారు. భారత్‌.. ప్రజాస్వామ్యానికే తల్లి లాంటిదని చెప్పేందుకు గర్విస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 26, 2022, 10:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.