ETV Bharat / state

సీఎం జగన్ నిర్లక్ష్య ఫలితం - కొద్దిపాటి వర్షాలకే అతలాకుతలం అవుతున్న నగరాలు, పట్టణాలు

Cities people fire on CM Jagan Negligence: నగరాలు, మానవ ప్రగతికి చిహ్నాలు. అవి పెట్టుబడులను ఆకర్షిస్తాయి. యువత ఉపాధికి ఊతమిస్తాయి. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి చోదకశక్తిగా పని చేస్తాయి. అటువంటి నగరాలు ప్రస్తుతం జగన్ ప్రభుత్వం హయంలో చిన్నపాటి వర్షానికే అతలాకుతలమవుతున్నాయి. నగరాలన్నీ వరదలతో నిండిపోయి నగరవాసులు నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ నిర్లక్ష్యం నగరాల ప్రజలకు శాపంగా మారిందని దుయ్యబడుతున్నారు.

cities_people_fire_on_cm_jagan
cities_people_fire_on_cm_jagan
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 8, 2023, 8:48 AM IST

Updated : Dec 8, 2023, 8:55 AM IST

Cities people fire on CM Jagan Negligence: ఆంధ్రప్రదేశ్‌లో మిగ్‌జాం తుపాను కారణంగా నగరాలు చెరువులుగా మారాయి. జిల్లాలోని రోడ్లన్ని వరద నీరుతో ఏరులై పారుతున్నాయి. గ్రామాల్లో వాగులు, వంకలు నిండి పంట పొలాలు నీటమునిగి, ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు స్పందించి ఇకనైనా ఈ కష్టాల నుంచి గట్టెక్కించాలని మొరపెట్టుకున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంపై పట్టణవాసులు ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ నిర్లక్ష్యం నగరాల ప్రజలకు శాపంగా మారిందని దుయ్యబట్టారు.

All Cities Waterlogged by Slightest Rain: వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం రాష్ట్రంలోని నగరాల్లో నివసిస్తున్న ప్రజలకు శాపంగా మారింది. చిన్నపాటి చినుకుపడితేనే విశాఖ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, కడప, తిరుపతి, అనంతపురం వంటి జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. వీటితోపాటు నగరాలు సైతం ఓ మోస్తరు వర్షానికే అల్లాడుతున్నాయి. అయినా, జగన్‌ ప్రభుత్వానికి పట్టడంలేదు. అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు గడిచిపోయినా నగరాల్లో వరద నీరు, మురుగునీటి పారుదల వ్యవస్థల్ని మెరుగుపరిచే విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. గత ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టిన ప్రాజెక్టుల్ని పూర్తిగా గాలికొదిలేసింది. వాటిని పూర్తి చేస్తే ఆ ప్రభుత్వానికే పేరు వస్తుందన్న అక్కసుతో పక్కన వాటిని పక్కన పెట్టేసింది. నగరాల్లో కనీస మౌలిక వసతుల అభివృద్ధిపై మంత్రులు గానీ, ఎమ్మెల్యేలు గానీ ఒక్కసారి కూడా సమీక్షలు నిర్వహించిన దాఖాలాల్లు లేకపోవడంతో నగరాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్ - నిలిచిన ప్రభుత్వ ఈ-ఆఫీస్ నెట్‌వర్క్‌

Vijayawada City: విజయవాడ నగరంలో ఎప్పుడు వర్షం కురిసినా పటమట, మొగల్రాజపురం, బెంజిసర్కిల్‌ వంటి కూడళ్లు, జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న కాలనీలు, వన్‌టౌన్‌ ప్రాంతంలోని వీధులన్నీ వర్షపు నీటితో మునిగిపోయి, రాకపోకలకు భంగం కలిగిస్తాయి. టీడీపీ ప్రభుత్వ హయంలో ఇటువంటి సమస్యలను పరిష్కారించడానికి అప్పటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు 461 కోట్లు రూపాయలు మంజూరు చేశారు. దాంతో 2017 ఏప్రిల్‌లో వాననీటి పారుదల ప్రాజెక్టు పనులు చేపట్టారు. ఇంతలోనే వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పనులన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయాయి. అంతేకాదు, 2021లో గుత్తేదారు సంస్థను తప్పించడంతో ఇప్పటివరకు ఆ పనులకు అతీగతీ లేకుండా పోయింది.

Guntur City: గుంటూరు నగరంలో భారీ వర్షం కురిస్తే చాలు వీధులు, రోడ్లన్నీ నీటిలో మునిగిపోతున్నాయి. నగరంలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ పనుల్ని అరకొరగా చేసి వదిలేయడంతో నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. నగరంలో భూగర్భ మురుగుకాలువల ఏర్పాటుకు అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు 500 కోట్ల రూపాయలు మంజూరు చేయగా, సుమారు 853 కోట్ల రూపాయలతో 2017లోనే ఆ పనులు ప్రారంభమై, 50శాతం పనులు కూడా పూర్తయ్యాయి. ఆ పనులకు సుమారు 416 కోట్ల రూపాయలు కూడా వెచ్చించారు. అయితే, అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ ఈ ప్రాజెక్టుని అటకెక్కించింది. పైపులు వేయటానికి తవ్వేసిన రోడ్లను చాలా చోట్ల పునరుద్ధరించకపోవడంతో పలు ప్రాంతాల్లో మోకాల్లోతు గుంతలు ఏర్పడి వాహనాదారులు అవస్థలు పడుతున్నారు.

మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్ - పంట పొలాల్లో నిలిచిన వరద నీరు- రైతుల కళ్లలో కన్నీరు

Nellore Town : నెల్లూరు నగరంలో కురిసిన వర్షపు నీరంతా, సర్వేపల్లి కాలువలోకి వెళ్లేలా నిర్మించిన అనేక కాలువలు ఆక్రమణకు గురయ్యాయి. దీంతో నగరంలో ఎప్పుడు వర్షం పడినా వీధులన్నీ నీట మునుగుతున్నాయి. అప్పటి టీడీపీ ప్రభుత్వం 645 కోట్ల రూపాయలతో నెల్లూరులో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ప్రారంభించింది. 420 కిమీలకు సుమారు 390 కిమీల పనులు పూర్తయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారులు పనులు ఆపేశారు. నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ రెండున్నరేళ్లపాటు మంత్రిగా ఉన్నా నగరాన్ని ముంపు సమస్య నుంచి బయటపడేసేందుకు ఎలాంటి ప్రయత్నం చేయకపోవడంపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మిగ్‌జాం తుపాను ధాటికి నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్‌ వంటి ప్రాంతాలు చెరువుల్లా మారిపోవడంతో వైసీపీ ప్రభత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

YSR Kadapa Town City: సీఎం జగన్ సొంత జిల్లా అయిన కడపలో చినుకు కురిస్తే చాలు జనం వణికిపోతున్నారు. నాయకులు, వారి అనుచరగణం నగరం చుట్టూ ఉన్న చెరువుల్ని, అలుగుల్ని, వంకల్ని, వాగుల్ని యథేచ్ఛగా ఆక్రమించేయడంతో చిన్న వర్షానికే కడప ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఒకప్పుడు బుగ్గవంక మాత్రమే నగరానికి ప్రమాదకరంగా ఉండేది. ఇప్పుడు ప్రతి వంక, చివరకు మురుగు కాలువా అత్యంత ప్రమాదకరంగా పరిణమించాయి. నగరంలో వరద కాలువల నిర్మాణానికి డీపీఆర్‌ సిద్ధం చేయించారు. 500 కోట్ల రూపాయలు అవసరమవుతుందని అంచనా వేశారు.

అదీ ముందుకి వెళ్లలేదు. ఈ ఏడాది జులై 10న కడప వెళ్లిన సీఎం ప్రాజెక్టుకి శంకుస్థాపనే చేశారు. కానీ, ఇప్పటివరకూ అంగుళం కూడా ముందుకు కదల్లేదు. ఒక సందర్భంలో ఆక్రమణల తొలగింపు అంటూ హడావుడి చేశారు. పేదలు అధికంగా నివసించే ప్రకాశ్‌ నగర్, వరద కాలనీ, తిలక్‌ నగర్‌ వంటి చోట్ల ఇళ్లు పడగొట్టారు. ఎన్జీఓ కాలనీ, అప్సరా థియేటర్, అంబేడ్కర్‌ కూడలి- వైజంక్షన్‌ వంటి చోట్ల పలుకుబడి కలిగిన వ్యక్తుల భవనాల జోలికి పోలేదు.

Tirupati Town : ఆధ్యాత్మిక క్షేత్రంమైన తిరుపతిపైనా వైఎస్ జగన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం కనబరుస్తోంది. 2021 నవంబరులో కురిసిన భారీ వర్షాలకు తిరుపతి నగరం తల్లడిల్లింది. తిరుపతి వరద ముంపు నివారణ, ఇతర అభివృద్ధి పనులకు 183 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు 2021 మే 31న ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ నిధులు వస్తాయనుకున్న అధికారులు 267 అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచేశారు. ఇప్పటివరకు రూ.7 కోట్లకు మించి రాలేదు. మిగ్‌జాంతో తిరుపతిలో భారీ వర్షాలు కురవకున్నా నగరం అతలాకుతలమైంది.

Machilipatnam Town : దేశంలోనే పురాతన మున్సిపాలిటీల్లో మచిలీపట్నం ఒకటి. ఇది 1866లోనే పురపాలక సంఘంగా ఏర్పాటైంది. మచిలీపట్నం భౌగోళికంగా సముద్రమట్టానికి దిగువన ఉండటంతో మురుగునీటి పారుదల పెద్ద సమస్యగా మారింది. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో నిపుణుల సూచన మేరకు ఓపెన్‌ డ్రెయిన్ల నిర్మాణం చేపట్టేందుకు 2008లో అప్పటి ప్రభుత్వం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ పథకం కింద 80 కోట్ల రూపాయలు మంజూరుచేసింది.

గుత్తేదారు సంస్థ లాభసాటి పనుల వరకూ చేసి మిగతా వాటిని మధ్యలోనే వదిలేయడంతో సమస్య మరింత జఠిలమైంది. అసంపూర్తి పనులను పూర్తి చేసేందుకు తెదేపా హయాంలో 21 కోట్ల రూపాయలు కేటాయించారు. నగరవ్యాప్తంగా 86 కిలోమీటర్ల మేర అంతర్గత డ్రెయిన్ల నిర్మాణం, వాననీటి పారుదల వ్యవస్థల ఏర్పాటు, అవసరమైన చోట ఎత్తిపోతల పథకాలు అమలు చేసేందుకు మరో రూ.68 కోట్లు మంజూరు చేసింది. వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి.

Eluru Town: ఏలూరులో కొద్దిపాటి వర్షానికే రోడ్లు, డ్రెయిన్లు ఏకమై పొంగుతాయి. ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంతోపాటు ప్రభుత్వాసుపత్రినీ వరద నీరు చుట్టుముడుతున్నా నివావరణ చర్యల్లేవు. టీడీపీ ప్రభుత్వం యూడీజీకి నిధులు కేటాయించి పనులు ప్రారంభించగా, వైసీపీ ప్రభుత్వం అటకెక్కించడంపై నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

'తుపాను ప్రభావం' ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షం - అవస్థలు పడుతున్న రైతన్నలు

సీఎం జగన్ నిర్లక్ష్య ఫలితం - కొద్దిపాటి వర్షాలకే అతలాకుతలం అవుతున్న నగరాలు,పట్టణాలు

Last Updated : Dec 8, 2023, 8:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.