Chiranjeevi Fans Fire on YCP Leaders : రాష్ట్రంలో పలుచోట్ల సినీ హీరో చిరంజీవి అభిమానులు చేపట్టిన ఆందోళనలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైకాపా నేతలు కొడాలి నాని, పేర్ని నాని, మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్సీపీ నేతలు క్షమాపణ చెప్పాలని మెగా ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకోవటంతో తోపులాటలు జరిగాయి. చిరంజీవి అభిమానుల్లో కొందరిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
Chiranjeevi Fans Fire on AP Ministers : చిరంజీవి అభిమానులను చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని విజయవాడ వన్ వే రోడ్డులో పోలీసులు అడ్డుకోవడంతో కోపోద్రోక్తులైన అభిమానులు కొడాలి నాని క్షమాపణలు చెప్పాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అలాగే "డౌన్ డౌన్ కొడాలి నాని.. జై చిరంజీవ" అంటూ నినాదాలు అభిమానుల ర్యాలీని పోలీసులు ముందుకు వెళ్లనీయకపోవడంతో ఇరువర్గాల మధ్య భారీ తోపులాట జరిగింది. ఆందోళన అడ్డుకునే క్రమంలో చిరంజీవి యువత అధ్యక్షుడు కందుల రవితోపాటు పలువురు అభిమానులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు వాహనాలను ముందుకు వెళ్లనీయకుండా అభిమానులు అడ్డంగా పడుకున్నారు.
Chiranjeevi Fire on AP Govt : ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి ఆగ్రహం
Chiranjeevi Fans Protest Against Ministers : భారీగా చేరుకున్న అభిమానులను అదుపు చేయలేకపోయిన పోలీసులు, ముఖ్య నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. మిగిలిన అభిమానులు ఏజికే స్కూల్ సెంటర్లో విజయవాడ రోడ్డుపై ధర్నా నిర్వహించి, వంగవీటి మోహన రంగా విగ్రహానికి క్షీరాభిషేకాలు నిర్వహించారు. చిరంజీవి, రంగా అభిమానుల ఓట్లతో గెలిచిన కొడాలి నాని ఓ పెద్ద చెకోడీ గాడని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కొడాలి నానికు గుణపాఠం తప్పదని, స్థాయి మరిచి మెగాస్టార్ చిరంజీవిని విమర్శించిన కొడాలి నాని బహిరంగ క్షమాపణ చెప్పే వరకు ఆందోళన విరమించే ప్రసక్తి లేదని అభిమానులు స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చిరంజీవిపై వైకాపా ఎమ్మెల్యేలు కొడాలి నాని, పేర్ని నాని, మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జనసేన ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. స్థానిక గాంధీ సెంటర్లో వైసీపీ ఎమ్మెల్యేలు, కొడాలి నాని, పేర్ని నాని, మంత్రి అంబటి రాంబాబు చిత్రపటాలు ఉన్న ఫ్లెక్సీని దగ్ధం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలను చిత్రపటాలను చెప్పులతో కొడుతూ, కాళ్లతో తన్నుతూ ఆందోళన చేశారు.
సోనియా గాంధీతో మాట్లాడిన చిరంజీవి : మెగాస్టార్ చిరంజీవిపై వైసీపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అనంతపురంలో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి ప్రజల భవిష్యత్తు గురించి చిరంజీవి మాట్లాడితే విమర్శలు చేస్తారా అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని టవర్ క్లాక్ వద్ద అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై నిరసన తెలిపారు. వైసీపీ పాలనలో కనీసం ముంపు ప్రాంతాల ప్రజలకు నష్ట పరిహారం చెల్లించిందేది లేదని వారు ఆరోపించారు.
ప్రత్యేక హోదా అభివృద్ధి గురించి మాట్లాడితే విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనే సోనియా గాంధీతో ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన హోదా చిరంజీవికి ఉందని గుర్తు చేశారు. వైసీపీ మంత్రులు మరోసారి చిరంజీవి గురించి మాట్లాడితే ఊరుకునేది లేదని అభిమానులు హెచ్చరించారు.
"చిరంజీవిని తిట్టేంత స్థాయా నీది.. నీవు పెద్ద చెకోడిగాడివి.. నువ్వు చిరంజీవి, వంగవీటి రంగా ఓట్లుతో గెలచావు. చిరంజీవి, రంగా అభిమానులు వచ్చే ఎన్నికల్లో గుడివాడలో నిన్ను ఓడిస్తారు. కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు వెనుక్కు తీసుకుని, చిరంజీవికి క్షమాపణ చెప్పాలి."- చిరంజీవి అభిమానులు