ETV Bharat / state

ఆశించిన రాబడులు లేవు - వెంటాడుతున్న రెవెన్యూ లోటు - పెను ఉపద్రవం తప్పదా! - రాష్ట్ర స్థూల ఉత్పత్తిపై వైసీపీ నాయకులు

CAG Statistics on State Revenue Deficit: రాష్ట్రంలో అమ్మకం పన్నుపై ప్రభుత్వానికి అంతంత మాత్రంగానే ఆదాయం సమకూరుతోంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల వసూళ్లు అరకొరగానే నమోదవుతున్నాయి. పన్నులతో సమంగా అప్పులు ఉంటున్నాయి. లెక్కకు మించి రెవెన్యూ లోటు పెరుగుతోందని కాగ్‌ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

CAG_Statistics_on_State_Revenue_Deficit
CAG_Statistics_on_State_Revenue_Deficit
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 24, 2023, 8:42 AM IST

CAG Statistics on State Revenue Deficit : అభివృద్ధి ఉంటే రాబడి ఉంటుంది. ప్రజలకు ఆదాయాలు ఉంటే కొనుగోళ్లు ఉంటాయి. ఆ మేరకు పన్నులు వసూళ్లు అవుతాయి. ఒక వైపు రాష్ట్ర స్థూల ఉత్పత్తి (State Gross Product)పై గొప్పలు వల్లిస్తున్న వైఎస్సార్సీపీ (YSRCP Government) పాలనలో రాబడి కనిపించడం లేదు. ప్రభుత్వం అంచనా వేసుకున్నంత కూడా పన్నుల వసూళ్లు లేవు. రెవెన్యూ వసూళ్లూ అంతంతే. అదే సమయంలో అప్పులు మాత్రం రెట్టింపు చేస్తున్నారు. రెవెన్యూ లోటు లెక్కకు మించి పెరిగిపోతోంది.

AP Debts 2023: అప్పు చేయడంలో తగ్గేదేలే!.. అంటున్న జగన్‌ సర్కార్

Revenue Deficit Increasing in Andhra Pradesh : రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి ఏడు నెలల కాలానికి రాష్ట్ర ఆర్థిక స్వరూప గణాంకాలను కాగ్‌ (CAG) వెల్లడించింది. రాష్ట్ర ఆర్థికశాఖ సమర్పించిన లెక్కలనే కాగ్‌ వెల్లడిస్తూ ఉంటుంది. అక్టోబరు నెలాఖరు వరకు ఉన్న పరిస్థితిని కాగ్‌ గణాంకాలు వెల్లడించాయి. ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే రాష్ట్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌ అంచనాలను చట్ట సభల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందుతారు. ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు చేయాలి, ఎంత అప్పు తీసుకురావాలి వంటి అంశాలను అందులో పొందుపరుస్తారు. అలా ఏడాది మొత్తానికి వేసిన అంచనాల్లో తొలి ఏడు నెలల కాలానికి సుమారు 60 శాతం సాధిస్తే అంచనాలకు తగ్గట్టుగా రాష్ట్ర ఆర్థిక నిర్వహణ సాగుతున్నట్లు లెక్క. అయితే అక్టోబరు నెలాఖరు వరకు పన్నుల రాబడి, రెవెన్యూ రాబడి కూడా ప్రభుత్వం ఆశించిన మేర లేవు.

GV RAO INTERVIEW: 'అప్పుల ఊబిలో ఏపీ.. మేల్కోకపోతే పెను ఉపద్రవం తప్పదు'

Andhra Pradesh Government Income in CM Jagan Ruling : రెవెన్యూ రాబడి కన్నా ఖర్చులు ఎక్కువ ఉంటే దానిని రెవెన్యూ లోటుగా లెక్కిస్తారు. ఈ ఏడాది మొత్తానికి రాష్ట్ర రెవెన్యూ లోటు 22 వేల 316.70 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. అది ఏడు నెలలకే 42 వేల 343.59 కోట్ల లోటుగా తేలింది. ఇప్పటికే ఏకంగా 189 శాతం రెవెన్యూ లోటు ఏర్పడింది. మరో వైపు రాష్ట్రంలో ఏడాది మొత్తానికి 54 వేల 587.52 కోట్లు అప్పులు చేస్తామని బడ్జెట్‌ అంచనాల్లో పేర్కొన్నారు. అలాంటిది ఏడు నెలల్లోనే 59 వేల 720.34 కోట్ల మేర అప్పులు చేసేశారు. రాబోయే 5 నెలల్లో ఇంకెన్ని రుణాలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. పైగా ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చి కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పుల వివరాలు కాగ్‌కు వెల్లడించలేదు. కార్పొరేషన్ల అప్పులనూ రాష్ట్ర బడ్జెట్‌ ఖర్చులకే పరోక్ష పద్ధతుల్లో వినియోగిస్తున్నారు. ఇవన్నీ కలిపితే రాష్ట్ర రెవెన్యూ లోటు దారుణ స్థాయిలో ఉందో స్పష్టమవుతుంది.

రికార్డు స్థాయిలో అప్పులు, రాబోయే ప్రభుత్వానికి చుక్కలు కనపడటం ఖాయం!

ఆశించిన రాబడులు లేవు - వెంటాడుతున్న రెవెన్యూ లోటు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.