ఇవీ చదవండి:
అమరావతి రాజధానికి బెజవాడ బార్ అసోసియేషన్ మద్దతు - Bar Association expressed support capital
Bejawada Bar Association: అమరావతి రాజధానికి మద్దతుగా విజయవాడలో న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయస్ధానం వద్ద నుంచి జలవనరుల శాఖ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. రైతులు చేస్తున్న పోరాటంలో న్యాయం, ధర్మం ఉన్నాయని.. పాదయాత్రకు రాజకీయాలు ఆపాదించి అడ్డుకోవడం దుర్మార్గమని న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత అమరావతి రాజధానిపై సీఎం జగన్ మాట మార్చి.. భూములు ఇచ్చిన రైతులను మోసం చేశారని ఆరోపించారు. అమరావతి రైతులకు బెజవాడ బార్ అసోసియేషన్ అండగా నిలుస్తుందని, రైతులకు న్యాయపరంగా సహకారం అందిస్తామంటున్న న్యాయవాదులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి.
బెజవాడ బార్ అసోసియేషన్
ఇవీ చదవండి: