ETV Bharat / state

Attack On Traders Case: వస్త్ర వ్యాపారులపై దాడి కేసు.. ముగ్గురి అరెస్టు - Textile Traders Case two accused Arrested

Attack On Textile Traders Case: ధర్మవరం వ్యాపారులపై దాడి కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వస్త్ర దుకాణం ఎండీతో పాటు మరో ఇద్దర్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిపై నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టినట్లు సీపీ తెలిపారు. ఘటనలో ఎలాంటి రాజకీయ కోణం లేదని చెప్పారు.

Attack On Textile Traders Case:
వస్త్ర వ్యాపారులపై దాడి కేసు
author img

By

Published : Jul 8, 2023, 10:48 AM IST

వస్త్ర వ్యాపారులపై దాడి కేసు.. ముగ్గురి అరెస్టు

Attack On Textile Traders Case two accused Arrested: ధర్మవరం వస్త్ర వ్యాపారస్తులపై దాడి చేసిన ఆలయ సిల్క్స్‌ ఎండీ అవినాష్‌ గుప్తాతో పాటు మరొ ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరిపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టినట్లు సీపీ చెప్పారు. బకాయిలు అడిగినందుకే వ్యాపారులపై దాడి చేశారని.. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని అన్నారు.

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన వస్త్ర వ్యాపారులు శశి, ఆనంద్‌.. విజయవాడకు చెందిన ఆలయ శిల్క్స్‌కు వస్త్రాలు విక్రయించారు. దానికి సంబంధించి దుకాణ యజమాని అవినాష్‌ గుప్తా 2లక్షల 34 వేల రూపాయలు ఈ వ్యాపారులకు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తానికి చెక్కులు ఇవ్వగా బౌన్స్ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో బకాయిల వసూలు కోసం జూన్‌ 2న బకాయిలు వసూలు చేసుకోవటం కోసం విజయవాడకు వచ్చారని తెలిపారు.

విజయవాడకు వచ్చిన ఇద్దరు వ్యాపారులు.. వారికి రావాల్సిన నగదు గురించి అవినాష్​ను అడిగారని వివరించారు. ఆ సమయంలో వ్యాపారులకు, అవినాష్​కు మధ్య గొడవ జరిగిందని.. విజయవాడ సీపీ కాంతిరాణా టాటా చెప్పారు. ఈ దాడిలో అవినాష్​కు మరో ఇద్దరు సహాకరించారని వెల్లడించారు. వీరు ముగ్గురు కలిసి వ్యాపారులను నిర్బదించి.. షాప్​ లోపల వెనక్కి తీసుకువెళ్లారని తెలిపారు. ఆ తర్వాత వ్యాపారుల దుస్తులు ఊడదీసి 4 గంటలపాటు చిత్రహింసలు పెట్టడం, ప్లాస్టిక్​ కర్రతో కొట్టడం చేశారని వెల్లడించారు.

కొట్టడం మాత్రమే కాకుండా వారి దగ్గరున్న 5 లక్షల విలువైన బంగారు ఆభరణాలను అవినాష్‌ గుప్తా.. లాక్కున్నారని తెలిపారు. ఇదంతా వీడియో తీశారని, బయట దాడి విషయం చెప్తే.. వీడియో లీక్​ చేస్తామని బెదిరించారని వివరించారు. ఆ తర్వాత ఆ వీడియో బయటకు లీకయ్యి వైరలయ్యిందని.. చివరకు మీడియాకు చేరిందన్నారు. వ్యాపారులను కొడుతూ తీసిన వీడియో బయటికి రాగానే నిందితులు అవినాష్‌ గుప్తా, నాగేశ్వరరావును అరెస్టు చేశామని సీపీ తెలిపారు. నిందితులు వైసీపీకి చెందిన వారని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని సీపీ తెలిపారు. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని చెప్పారు.

"నా విచారణ ప్రకారం అవినాష్​కు ఎటువంటి రాజకీయ అనుభవం లేదు. అంతే కాకుండా ఏ రాజకీయ పార్టీతో సంబంధం కూడా లేదు. ఈ ఘటన కేవలం వ్యాపార లావాదేవిల వలనే జరిగింది. నిందితుడు నగదు చెల్లించకపోవటంతో వారు వచ్చి ఆడిగారు. ఈ క్రమంలో వారిపై దాడి చేశాడు. అంతేగానీ రాజకీయ సంబంధం లేదు." - కాంతిరాణా టాటా, విజయవాడ సీపీ

ఆలయ సిల్క్స్‌ ఎండీ అవినాష్‌ గుప్తాతో పాటు సూపర్‌వైజర్‌ నాగేశ్వరరావును నేడు న్యాయమూర్తి ముందు హజరుపరచనున్నారు. వీరితో పాటు దాడిలో పాల్గొన్న అవినాష్‌ కారు డ్రైవర్‌ సాయి, స్నేహితుడు బాలకృష్ణను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.