ASHA Workers State Protest : శ్రీకాకుళంలో ఆశా వర్కర్ల 36 గంటల ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. బలవంతంగా మినీ లారీల్లో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. కలెక్టరేట్ ముట్టడికి సిద్ధమైన ఆశాలను ముందే అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర తోపులాట జరిగింది. పార్వతీపురంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వరకూ భారీ ర్యాలీ చేశారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన ఆశా వర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు. విశాఖ జీవీఎంసీ గాంధీ పార్కు వద్ద మహాధర్నాలో ఉన్న ఆశా కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు.
ఆశా వర్కర్లకు అరుదైన గౌరవం.. సత్కరించిన డబ్ల్యూహెచ్ఓ
Asha Workers Demands : కనీస వేతనాలు చెల్లించి, పని భారం తగ్గించాలని కాకినాడ జిల్లాలో 36 గంటల ధర్నాలో ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. పదవీ విరమణ అనంతరం పింఛన్లు మంజూరు చేయాలని, ఆశా వర్కర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని విజయవాడ ధర్నాచౌక్‌లో నినదించారు. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ పనుల్లో ఏదో ఒకటే చేస్తామని గుంటూరు కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్లు స్పష్టం చేశారు.
ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రకాశం జిల్లా ఒంగోలులో మండిపడ్డారు. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్లు 36 గంటల నిరవధిక ధర్నా నిర్వహించారు. అనంతపురం జిల్లాలో ఆశావర్కర్లు వంట-వార్పు నిర్వహించారు. చాలీచాలని జీతాలతో కుటుంబ భారం కష్టంగా మారిందని వాపోయారు.
సమస్యలపై ఆశావర్కర్ల పోరుబాట.. వర్షంలోనూ ఆగని నిరసన
36 Hours Dharna of Asha Workers : రాష్ట్రవ్యాప్తంగా ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కారం కోరుతూ 36 గంటల నిరసన దీక్షలతో పాటు వంటా వార్పులు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆశా కార్యకర్తలు ఆందోళనల్లో పాల్గొన్నారు. విజయవాడ ధర్నాచౌక్‌లో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షకు ఎమ్మెల్సీ కె. ఎస్. లక్ష్మణరావు మద్దతిచ్చి ప్రసంగించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆశావర్కర్లు రిలే దీక్షలు.. పట్టించుకోని అధికారులు
అదేవిధంగా సీపీఐ రాష్ట్రకార్యదర్శి కె. రామకృష్ణ మాట్లాడుతూ నాలుగున్నరేళ్లలో జగన్కు ఆశా కార్యకర్తలు గుర్తుకు రాలేదని విమర్శించారు. ప్రభుత్వం దిగివచ్చేవరకూ పోరాడాలని వారికి పిలుపునిచ్చారు. అలాగే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఇప్పటికే ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు. అంగన్వాడీల స్ఫూర్తితో 36గంటల పాటు ఆశా కార్యకర్తలు నిలబడి ప్రభుత్వానికి తగిన బుద్ధిచెప్పాలని కోరారు. ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం అందరినీ ముంచేసిందన్నారు. ఆశా కార్యకర్తలతో వెట్టి చాకిరీ చేయిస్తోందని, అలాగే రాజకీయ ఒత్తిళ్లు పెరిగిపోయాయని తెలిపారు.