ETV Bharat / state

ఆర్టీసీ ఉద్యోగులు నిర్వేదం : పాత ప్రయోజనాలు పాయే..! కొత్త కష్టాలు వచ్చే..!

author img

By

Published : Jan 28, 2023, 8:54 AM IST

Updated : Jan 28, 2023, 10:04 AM IST

APSRTC EMPLOYEES: ప్రభుత్వంలో విలీనమంటే సంబరపడ్డారు. ఇక మీరూ ప్రభుత్వ ఉద్యోగులేనని చెప్తే పొంగిపోయారు. నెల రోజుల్లో అన్నీ చేసేస్తాం అని చెప్తే ఎగిరి గంతేశారు. కానీ కొత్తగా దక్కిందేమీలేదు. పైపెచ్చు పాత ప్రయోజనాలూ దురమయ్యాయి. ఇచ్చిన హామీలు గుర్తుచేసినా, కోల్పోయిన ప్రయోజనాలు అమలు చేయాలని కాళ్లరిగేలా తిరిగినా ప్రభుత్వం స్పందించడంలేదు. ఆర్టీసీ విలీనం విషయంలో అనుకున్నదొకటి అయింది ఒకటంటూ ఉద్యోగులు నిర్వేదంలో మునిగిపోయారు.

ఆర్టీసీ ఉద్యోగులకు
APSRTC

APSRTC EMPLOYEES: ఏపీఎస్ఆర్టీసీలో 50 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. 2020 జనవరి 1 నుంచి వీరందరినీ ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజా రవాణా విభాగం ఉద్యోగులని వాళ్లకు ట్యాగ్‌ వేశారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ప్రయోజనాలేవీ కల్పించలేదనే అసహనం సిబ్బందిలో కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ 2022 నుంచి 11వ పీఆర్‌సీని అమలు చేసిన ప్రభుత్వం ఆర్టీసీకి మాత్రం సెప్టెంబర్ 2022 నుంచి అమలు చేసింది.

కానీ జూన్, జూలై, ఆగస్టు నెలల బకాయిల చెల్లింపుల సంగతేంటని అడిగితే చెప్పేవారేలేరు. ఆర్టీసీ కార్మికులుగా ఉన్నన్నాళ్లు ఉద్యోగులు అదనపు పనిగంటలు పనిచేస్తే వారికి వివిధ రకాల అలవెన్సులు ఇచ్చేవారు. విలీనం తర్వాత గతేడాది ఆగస్టు నుంచి ఓవర్ టైం, అలవెన్సులను ప్రభుత్వం నిలిపివేసిందని ఇస్తారో లేదో స్పష్టత లేదని ఉద్యోగులు వాపోతున్నారు. కార్పేరేషన్‌లో ఉండగా ఏటా ఉద్యోగులకు లీవ్‌ ఎన్‌ క్యాష్‌మెంట్‌ ఉండేది. విలీనం తర్వాత అదీ ఆపేశారు. 2020-21 ఏడాదికి సంబంధించి ఉద్యోగులు దరఖాస్తు చేసి ఏడాది గడిచినా లీవులు మినయించారు తప్ప డబ్బు చెల్లించలేదని అసహనం వ్యక్తంచేస్తున్నారు. వీటన్నంటిపై ఆర్టీసీ ఉన్నతాధికారులను నేరుగా కలిసినా, సీఎం జగన్‌కు లేఖలు రాసినా స్పష్టత లేదని సంఘాల నేతలు ఆక్షేపిస్తున్నారు.

ఆర్టీసీ కార్మికులకు గతంలో ఆటోమెటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీమ్‌ - ఏఏసీ స్పెషల్‌ గ్రేడ్స్‌ అమల్లో ఉండేవి. ప్రభుత్వంలో విలీనం తర్వాత ఆ స్పెషల్‌ గ్రేడ్స్‌ విధానం రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న ఏఏసీ అమలు చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటిదాకా అది కార్యరూపం దాల్చలేదు. జిల్లాల్లో అధికారులు నిబంధనల ప్రకారం ఉద్యోగులకు ఏఏసీను వర్తింపజేసి జీతాల బిల్లులు అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఖజానాశాఖ అధికారులు మాత్రం తమకు ప్రత్యేక ఆదేశాలు రావాలంటూ వాటిని తిరస్కరిస్తున్నారు. ఇదేంటని ఎవరిని అడిగినా మౌనమే సమాధానం అవుతోందని కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు.

ప్రభుత్వంలో విలీనం అంటే ఏదో లబ్ధి జరుగుతుందని ఆశించిన తమకు నిరాశే మిగిలిందని కనీసం తమకు గతంలో ఉన్న ప్రయోజనాలనైనా తీసేయవద్దని ఆర్టీసీ ఉద్యోగులు వేడుకుంటున్నారు.

ఆర్టీసీ ఉద్యోగులు నిర్వేదం

ఇవీ చదవండి

Last Updated : Jan 28, 2023, 10:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.