APGEA leader Suryanarayana: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆచూకీ కోసం ప్రభుత్వం పోలీసులు ఉద్యోగ సంఘం నేతలను ఇబ్బందులు పెడుతున్నారని.. ఆ సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు ఆరోపించారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆచూకీ కోసమంటూ... గత మూడు రోజులుగా పోలీసులు... ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి ఆరాలు తీయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నేతలపై పోలీసుల వేధింపులు ఆపాలని వెల్లడించారు. ఎవరి ప్రోద్భలం పోలీసులు ఇలా చేస్తున్నారో తెలియదన్నారు.
CPS: సీపీఎస్ విధానానికి చట్టం చేయలేదు..ఈ అంశంపై కోర్టుకెళ్తాం: సూర్యనారాయణ
ఐదో ముద్దాయిగా సూర్యనారాయణ: కమర్షియల్ టాక్స్ విభాగంలో ఉద్యోగులు ఉదాసీనంగా వ్యవహరించారని, ప్రభుత్వ ఖజానాకు నష్టం కల్గించాలని ఇప్పటికే నలుగురు కమర్షియల్ టాక్స్ ఉద్యోగులను అరెస్టు చేశారన్నారు. ఐదో ముద్దాయిగా ఎపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.ఆర్. సూర్యనారాయణను చేర్చారని తెలిపారు. కె.ఆర్. సూర్యనారాయణను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని జి. ఆస్కార్ రావు వెల్లడించారు. రాష్ట్రంలో 3 రోజులుగా పోలీసులు భయానక వాతావరణం నెలకొల్పుతున్నారన్నారని ఆయన మండిపడ్డారు. సూర్యనారాయణను పట్టుకోవాలనుకుంటే మాకు అభ్యంతరం లేదని తెలిపారు.
KR Suryanarayana ఆపరేషన్ 'సూర్యనారాయణ'.. అరెస్టు చేసేందుకు రంగంలోకి రెండు బృందాలు
ఆచూకీ కోసం వేధింపులు : సూర్యనారాయణ తమతో లేరని, ఆయన ఎక్కడున్నారో సమాచారం లేదని ఆస్కార్ రావు తెలిపాడు. గత మూడు రోజులుగా పోలీసులు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాము ఉద్యోగులమని, నేరస్తులం కాదని.. పోలీసులు ఇబ్బందులు పెట్టొద్దని వారిని ఆస్కార్ రావు కోరారు. ఉద్యోగులు మంచి చేయాలనే తాము ఉద్యమాలు చేస్తున్నామని ఆయన వెల్లడిచారు. రేపట్నుంచి తాను విజయవాడలోని ఎపీజీఈఎ కార్యాలయంలో అందుబాటులో ఉంటానని, పోలీసుల విచారణకు సహకరిస్తామన్నారు.
'గత మూడు రోజుల నుంచి ఏపీ ఉద్యోగుల సంఘానికి చెందిన... ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి మా గురించి ఆరా తీస్తున్నారు. కమర్షియల్ టాక్స్ కేసులో ఐదో ముద్దాయిగా ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.ఆర్ . సూర్యనారాయణను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు సూర్యనారాయణను పట్టుకోవడానికి మమ్మల్ని హింసిస్తున్నారు. మా ఇంటికి సూర్యనారాయణ వచ్చారని అంటున్నారు. ఉద్యోగులకు మంచి చేద్దాం అని ప్రశ్నిస్తే మాపై కక్షగట్టి ఇబ్బందులు పెడుతున్నారు. అసలు ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియకపోయినా.. ఆయన ఎక్కడ ఉన్నాడు అంటూ మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఇదే అంశంపై డీజీపీకి సైతం విన్నవించుకుంటున్నాం. ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు, మాకు సంబంధం లేదు.. అయినా మమ్మల్ని వేధిస్తున్నారు'-. జి.ఆస్కార్ రావు, ఎపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి