ETV Bharat / state

TOP NEWS : ఏపీ ప్రధాన వార్తలు @ 3 PM - AP LATEST NEWS

ఏపీ ప్రధాన వార్తలు

ap top news
ap top news
author img

By

Published : Dec 19, 2022, 3:00 PM IST

  • ఎన్నడూ లేని అరాచకాలు మహేష్ రెడ్డి గెలిచాక జరిగాయి: యరపతినేని
    MLA Yarapatineni: మాచర్ల ఘటనలపై పల్నాడు ప్రాంత వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి, రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. గురజాల ఎమ్మెల్యేగా కాసు మహేష్ రెడ్డి గెలిచాక నియోజకవర్గంలో 8మంది అమ్మాయిలు మరణించారని, 10మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు నాయకులు మృతి చెందారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నన్ను కాపాడటానికి మీరు చూపిన తాపత్రయం మర్చిపోలేను: బ్రహ్మారెడ్డి
    JULAKANTI BRAHMAREDDY : మాచర్లలో తెలుగుదేశం శ్రేణులు ఇక పైనా పట్టుదల కొనసాగించాలని.. పార్టీ ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలకు కాలమే సమాధానం చెబుతుందన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో కార్యకర్తలకు నేరుగా అందుబాటులో ఉండలేకపోతున్నానని.. ఏదైనా ఇబ్బంది ఉంటే రాష్ట్ర పార్టీకి తెలియజేయాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • చంద్రబాబు, మీడియా సంస్థలను నిందిస్తే సచ్చీలుడు కాలేవు :సోమిరెడ్డి
    SOMIREDDY ON MINISTER KAKANI : నీచమైన నేర చరిత్రతో మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి.. నెల్లూరు జిల్లా పరువు తీశారని.. తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు.. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. కోర్టులో పత్రాల దొంగతనం కేసులో.. చంద్రబాబునో, మీడియా సంస్థలనో నిందిస్తే సచ్చీలుడు కాలేరంటూ.. హితవు పలికారు. ఏమాత్రం నైతికత ఉన్నా మంత్రి పదవి నుంచి కాకాణి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పోలీస్​ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచాలని విద్యార్థి సంఘాల డిమాండ్​
    Student Unions on AP Police Jobs Notification : ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన పోలీస్​ ఉద్యోగాలకు.. వయోపరిమితి పెంచాలని విద్యార్థి సంఘాలు చర్చా గోష్టి నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి నాయకులు వయోపరిమితి సడలించాలని ప్రభుత్వాన్ని కొరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అంధ యువతుల ఫ్యాషన్​ షో అదరహో
    గుజరాత్​లో అంధ యువతుల ఫ్యాషన్​ షో ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది. ఆదివారం రాత్రి రాజ్​కోట్​లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్​ జ్యువెలరీ డిజైన్ ఆధ్వర్యంలో ఈ లాక్మే ఫ్యాషన్​ షో జరిగింది. ఈ షోలో పాల్గొన్న వారంతా దృష్టిలోపం ఉన్నవారే. వారిలో కొందరు సహాయకులతో స్టేజ్ ​పైకి వచ్చి సందడి చేశారు. రకరకాల దుస్తులతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వాచ్​, మొబైల్​ చూడకుండానే టైమ్​ చెప్పేస్తున్న యువకుడు.. ఎలాగో తెలుసా?
    సాధారణంగా ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా చదివి అప్పజెప్పమంటే చెప్పలేరు కొందరు. అలాంటింది గడియారం వైపు చూడకుండానే సరిగ్గా టైమ్​ను చెప్పడమంటే మాములు విషయం కాదు. అలాంటిది ఓ వ్యక్తి 25 సంవత్సరాలుగా వాచ్​, మొబైల్ ను చూడకుండా కరెక్ట్ టైమ్​ చెప్పేస్తున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కెనడాలో కాల్పుల కలకలం.. నిందితుడుతో సహా ఆరుగురు మృతి
    Shooting In Canada 2022 : కెనడాలో కాల్పులు కలకలం రేపాయి. ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు వ్యక్తులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు కూడా అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వ్యక్తిగత రుణమా.. హౌసింగ్ లోనా?.. ఏది ముందు తీర్చేయాలి?
    ఆర్‌బీఐ రెపో రేటు పెంచడం వల్ల గృహరుణాల రేట్లు పెరగడం ప్రారంభించాయి. ఇప్పటికే అనేక బ్యాంకులు తమ రెపో ఆధారిత రుణాల రేట్లను సవరించాయి. దీంతో చాలామందికి రుణ వ్యవధి ఒక్కసారిగా మారిపోయింది. 20 ఏళ్లకు తీసుకున్న రుణం.. తీరేందుకు 27-28 ఏళ్లు పడుతోంది. అందుకే రుణగ్రహీతలు సాధ్యమైనంత వేగంగా ఇంటి రుణం తీర్చేందుకు సిద్ధం అవుతున్నారు. మరోవైపు ఇంటి రుణంతోపాటు, వాహన, వ్యక్తిగత రుణాలు ఉన్న వారు దేన్ని ముందు తీర్చాలనే సందేహంతో ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రిటైర్మెంట్ ఇప్పట్లో లేదు.. ఇంకొన్నాళ్లు ఆడుతా: మెస్సీ
    ప్రపంచకప్‌ తర్వాత మెస్సీ రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడని ఆందోళన చెందుతున్న అభిమానులకు ఊరటనిచ్చే కబురు ఇది. మెస్సీ ఇప్పట్లో రిటైర్మెంట్‌ ప్రకటించడం లేదట. ప్రపంచకప్‌ ఫైనల్‌ తర్వాత అతడే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఓ మై గాడ్'.. విమానం నుంచి అలా దూకేశావేంటి మెహ్రీన్!
    క్యూట్ బ్యూటీ మెహ్రీన్ వరుసగా సాహసాలు చేస్తూ ఆకట్టుకుంటోంది. కొద్దిరోజుల క్రితం వాటర్ డైవ్ చేసిన ఈ ముద్దుగుమ్మ..తాజాగా అబుదాబిలో స్కై డైవ్ చేసి ఆశ్చర్యపరిచింది. ఆ వీడియోను ఇన్​స్టాలో పంచుకుంది. ఓ సారి మీరు ఆ వీడియోను చూసేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.