ETV Bharat / state

సాయంత్రం మలిదశ ఉద్యమ కార్యాచరణ షెడ్యూల్‌: ఏపీ ఐకాస అమరావతి - విజయవాడలో ఏపీ ఐకాస అమరావతి

AP JAC AMARAVATI MEETING : ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏపీ ఐకాస అమరావతి భవిష్యత్​ కార్యాచరణపై దృష్టి పెట్టింది. ఈ మేరకు విజయవాడలో సమావేశమైంది. మొదటి దశ ఉద్యమ కార్యాచరణ పూర్తయినందున మలిదశ కార్యాచరణ షెడ్యూల్​ను సాయంత్రం ప్రకటించనున్నట్లు ఏపీ జేఏసీ నేతలు తెలిపారు.

AP JAC AMARAVATI MEETING
AP JAC AMARAVATI MEETING
author img

By

Published : Apr 5, 2023, 10:57 AM IST

Updated : Apr 5, 2023, 12:36 PM IST

AP JAC AMARAVATI MEETING : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై.. ఆందోళన బాటపట్టిన ఏపీ జేఏసీ అమరావతి.. భవిష్యత్‌ కార్యచరణపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా విజయవాడలోని రెవెన్యూ భవన్​లో APJAC అమరావతి రాష్ట్ర కార్యవర్గం సమావేశమైంది. 26 జిల్లాల ప్రధాన కార్యదర్శులు, ఛైర్మన్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. మొదటి దశ ఉద్యమ కార్యాచరణ పూర్తయినందున మలిదశ కార్యాచరణ షెడ్యూల్​ను సాయంత్రం ప్రకటించనున్నట్లు ఏపీ జేఏసీ నేతలు తెలిపారు. ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలను ఉద్యోగుల ఏపీజీఎల్ఐ బకాయిల కింద ఇచ్చామనీ చెబుతోందని.. కానీ ఎంత మేరకు ఇచ్చారో వివరాలు కోరితే నేటికీ చెప్పటం లేదని మండిపడ్డారు.

"సాయంత్రం మలిదశ ఉద్యమ కార్యాచరణ షెడ్యూల్‌ ప్రకటిస్తాం. ఇప్పటికే ఉద్యోగులను ఉద్యమానికి సమాయత్తం చేశాం. గతంలో సీఎం ఇచ్చిన హామీలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి"-ఏపీ ఐకాస అమరావతి

సీఎస్​తో జరిగిన ఉద్యోగ సంఘాల సమావేశం మినిట్స్ నేటి వరకు అందించలేదని నేతలు ఆరోపించారు. ఉద్యమ కార్యాచరణకు పిలుపు ఇవ్వడంతోనే ప్రభుత్వం స్పందిస్తోందన్నారు. ఈ సాయంత్రం మలిదశ ఉద్యమ కార్యాచరణ షెడ్యూల్​ను ప్రకటిస్తామని నేతలు వెల్లడించారు. ఇప్పటికే వివిధ హెచ్​వోడీలు, ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లి ఉద్యోగులను ఉద్యమానికి సమయత్తం చేశామని స్పష్టం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి.. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఇచ్చిన హామీలను నేటికీ నెరవేర్చలేదన్నారు. గతంలో ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో ఇచ్చిన హామీలు ఇంకా పెండింగ్​లో ఉన్నాయని తెలిపారు. సీపీఎస్​తో పాటు ఇతర సమస్యలకు ఇప్పటికే పరిష్కారం చూపిస్తామని సాగదీస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని.. అందుకే మలిదశ ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నామని తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 5, 2023, 12:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.