ETV Bharat / state

ఉద్యోగులకు లక్ష ఆశ చూపించి వందతో సరిపెట్టిన ఏపీ సర్కారు - ప్రభుత్వ ప్రచార ఆర్భాటంగా మిగిలిపోయిన ఈ బైక్స్ - about E Bikes Scheme in ap

AP Employees E Bikes Scheme: విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి... ఉద్యోగులకు విద్యుత్‌ వాహనాలను అందించే ఫేమ్‌-2 పథకంపై.. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ఈ లోగా కేంద్రం... ఫేమ్‌-2 పథకం కింద అందించే రాయితీ మొత్తాన్ని తగ్గించింది. ఈ కారణంగా కేంద్రం నుంచి ఇచ్చే రాయితీ ఉద్యోగులకు దక్కకుండా పోయింది. తద్వారా వాయిదా పద్ధతిలో చెల్లించడం ద్వారా వాహనం సమకూరుతుందనుకున్న ఉద్యోగుల ఆశలపై నీళ్లుచల్లింది.

AP Employees E Bikes Scheme
AP Employees E Bikes Scheme
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 5, 2023, 3:59 PM IST

AP Employees E Bikes Scheme: రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే సిబ్బదికి కనీసం లక్ష విద్యుత్ ద్విచక్ర వాహనాలను అందించాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. దశలవారీగా కనీసం 5 లక్షల విద్యుత్ వాహనాలను అందించాలని ఆలోచన చేసింది. రెండేళ్ల కిందట ప్రాజెక్టును రూపకల్పన చేసింది. ఇంతగా కసరత్తు చేసి ప్రభుత్వం ఇచ్చిన వాహనాలు 100. అవి నిర్దేశిత లక్ష్యంలో 0.1 శాతం మాత్రమే. ప్రభుత్వం వాయిదా పద్ధతిలో ఉద్యోగులకు వాహనాలు ఇవ్వకపోగా... కేంద్రం నుంచి ఫేమ్‌-2 పథకం కింద ఇచ్చే రాయితీనీ వారికి దక్కకుండా చేసింది. వాయిదా పద్ధతిలో చెల్లించడం ద్వారా వాహనం సమకూరుతుందనుకున్న ఉద్యోగుల ఆశలపై నీళ్లుచల్లింది.

ఏపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల కేంద్రం ఇచ్చే రాయితీని కోల్పోయిన ఉద్యోగులు

విద్యుత్ ద్విచక్ర వాహనాల కొనుగోలుకు చేసే ఖర్చును నెల వాయిదాలో చెల్లించేలా ప్రభుత్వ సిబ్బందికి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పేరుతో ప్రభుత్వం చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. సచివాలయ సిబ్బంది, మున్సిపల్‌ ఉద్యోగులతో పాటు... అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు ఏడాదిలో లక్ష విద్యుత్ ద్విచక్ర వాహనాలను ఇవ్వాలని లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. ఈ ప్రాజెక్టు అమలుకు 2021 జులైలో ప్రత్యేక ఉత్తర్వులను ఇచ్చింది. దీనికి అనుగుణంగా పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ- నెడ్‌క్యాప్‌ విధివిధానాలు రూపొందించింది. వాహనాల తయారీ సంస్థలతో సంప్రదింపులు జరిపింది. సమన్వయం కోసం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. రుణాన్ని అందించేలా బ్యాంకర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. వాహనాల కొనుగోలుకు రుణాలను పర్యవేక్షించడానికి విజయవాడలో యూనియన్ బ్యాంకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. వాహన కొనుగోలుకు తీసుకునే రుణాన్ని 24 నుంచి 60 వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది. ఇంతగా కసరత్తు చేసి... జగన్‌ ప్రభుత్వం అందించింది కేవలం 100 వాహనాలే. ఈ ప్రక్రియ మొత్తం ప్రభుత్వ ప్రచార ఆర్భాటంగా మారింది. ఉద్యోగులకు ఎంత మాత్రం ప్రయోజనం చేకూరింది లేదు.

ఈ-బైక్​ కొనాలా? టాప్​ మోడల్స్​ ఇవే.. ఫీచర్స్​పై ఓ లుక్కేయండి...

విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి... ఫేమ్‌-2 పథకం కింద కేంద్రం ఇచ్చే రాయితీ కూడా... రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల ఉద్యోగులు నష్టపోవాల్సి వచ్చింది. 3 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న వాహనానికి గరిష్ఠంగా 45 వేల రూపాయల రాయితీని.. అప్పట్లో కేంద్రం ఇచ్చింది. ఈ మొత్తాన్ని వాహన ధరలో మినహాయించి.. మిగిలిన మొత్తాన్ని బ్యాంకు నుంచి రుణంగా ఇప్పిస్తామని.... రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ప్రస్తుతం ఉద్యోగులు వాడుతున్న వాహనాలకు నెలకు పెట్రోలుకు అయ్యే ఖర్చును.. నెల వాయిదా కింద చెల్లిస్తే సరిపోతుందని.. అప్పట్లో జగన్‌ ప్రభుత్వం చెప్పింది. కానీ ప్రాజెక్టు అమలులో రెండేళ్ల పాటు జాప్యం చేసింది. ఈ లోగా కేంద్రం... ఫేమ్‌-2 పథకం కింద అందించే రాయితీ మొత్తాన్ని తగ్గించింది.

ఫేమ్‌-2 పథకం కింద కిలోవాట్‌కు 15 వేల రూపాయల వంతున... కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీ పోను... మిగిలిన మొత్తాన్ని వాహన కొనుగోలుదారులు చెల్లించాలి. వాహన ధరలో 40 శాతానికి మించకుండా కేంద్రం రాయితీగా ఇచ్చే నిబంధన 2023 ఏప్రిల్‌ వరకు అమలులోఉంది. 2023 మే నుంచి ఫేమ్ పథకం కింద కేంద్రం ఇచ్చే రాయితీ మొత్తాన్ని... వాహనధరలో 15 శాతానికి తగ్గించింది. దీనివల్ల 3 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న వాహనం కొనుగోలుకు గరిష్ఠంగా 30 వేల రూపాయలకు మించి కేంద్రం నుంచి రాయితీ పొందే అవకాశం లేదు.

'ఈ-బైక్'​లో మంటలు.. ఊపిరాడక తండ్రీకూతురు మృతి!

ఉద్యోగులకు విద్యుత్‌ వాహనాలను అందించే ప్రాజెక్టుతో రాష్ట్ర ప్రభుత్వంపై పైసా భారం పడే అవకాశం లేదు. వాహనాల తయారీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవడం.. కొనుగోలుకు ఆసక్తి చూపిన వారికి బ్యాంకు ద్వారా రుణ సదుపాయం కల్పించేలా సమన్వయం చేయడమే ప్రభుత్వం చేయాలి. ఈ మాత్రానికే రెండేళ్లు ఎందుకు జాప్యం చేసినట్లు? ప్రాజెక్టు అమలుపై రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించి ఉంటే.... కేంద్రం ఇచ్చే రాయితీ ప్రయోజనమైనా ఉద్యోగులు వినియోగించుకునే వెసులుబాటు లభించేది. అది కూడా వారికి దక్కకుండా చేసింది జగన్‌ ప్రభుత్వం.

అడవుల్లో దూసుకెళ్లే 'ఈ-బైక్​'.. సోలార్ ఎనర్జీతో ఛార్జింగ్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.