ETV Bharat / state

ఇకపై మంత్రులకు మాత్రమే సలహాదారులను నియమిస్తాం : రాష్ట్ర ప్రభుత్వం

Advisors Appointment : సలహాదారులను కేవలం మంత్రులకు మాత్రమే నియమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం.. హైకోర్టుకు వివరించింది. వారి నియమాలకు సంబంధించి నిబంధనలు కోర్టు ముందు ఉంచింది. ప్రభుత్వంలో వారి పాత్ర ఎంటనే అంశాలను వివరించింది.

ap high court
ap high court
author img

By

Published : Mar 22, 2023, 8:30 AM IST

Updated : Mar 22, 2023, 9:31 AM IST

ఇకపై మంత్రులకు మాత్రమే సలహాదారులను నియమిస్తాం : రాష్ట్ర ప్రభుత్వం

High Court on Advisors Appointment : ఇకపై మంత్రులకు మాత్రమే సలహాదారులను నియమిస్తామని.. ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. శాఖలకూ సలహాదారులను నియమించడాన్ని గతంలో హైకోర్టు తూర్పారబట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అదనపు అఫిడవిట్‌ దాఖలు చేసింది. సలహాదారుల నియామకాలపై.. విధాన రూపకల్పన చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని.. మంత్రివర్గం ఆమోదం పొందిన తర్వాత జీవో విడుదల చేస్తామని న్యాయస్థానానికి వివరించింది. వారూ అవినీతి నిరోధక చట్టంలోని పబ్లిక్ సర్వెంట్ నిర్వచనం కిందికి వస్తారని తెలిపింది.

దేవాదాయశాఖ సలహాదారుగా జ్వాలాపురపు శ్రీకాంత్, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారుగా ఎన్.చంద్రశేఖర్​రెడ్డి నియామకాల్ని సవాలు చేస్తూ వేర్వేరుగా దాఖలైన పిటిషన్లకు సంబంధించి.. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముత్యాలరాజు హైకోర్టులో అదనపు అఫడవిట్ దాఖలు చేశారు.

ఇకపై సలహాదారులుగానీ, ప్రత్యేక సలహాదారులుగా నియమితులయ్యే వారిని సంబంధిత మంత్రులకు సలహాదారులుగా నియమిస్తామని పేర్కొన్నారు. ఆయా సబ్జెక్టులో నైపుణ్యం ఆధారంగా ఈ నియామకం ఉంటుందన్నారు. సలహాదారులను నియమించుకోవాలని మంత్రులు భావిస్తే సీఎంకు రాతపూర్వకంగా తెలిపి.. ఆమోదం పొందాల్సి ఉంటుందన్నారు. సలహాదారుడి నియామకం అవసరమా, అందుకు తగిన వ్యక్తా కాదా అనే అంశాలపై క్రమం తప్పకుండా సమీక్ష ఉంటుందన్నారు.

సలహాదారులు ప్రజావిధులు నిర్వహిస్తారని అందుకే వారు అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 2(సీ) ప్రకారం పబ్లిక్ సర్వెంట్ నిర్వచనం కిందికి వస్తారని తెలిపారు. ప్రభుత్వ రహస్య వివరాలు బహిర్గతం చేయబోమని ప్రతి సలహాదారుడు అఫడవిట్‌పై సంతకం చేయాల్సి ఉంటుందన్నారు. విధానాల రూపకల్పనలో మంత్రులకు సలహాలు ఇవ్వడం వరకే సలహాదారుల పాత్ర పరిమితమని.. ముత్యాలరాజు అఫడవిట్‌లో స్పష్టం చేశారు.

సివిల్ సర్వెంట్ల రోజువారీ కార్యకలాపాల్లో సలహాదారులు జోక్యం చేసుకోవడం, జీతభత్యాల చెల్లింపు విషయాల్లో 2022లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ జీవో 36కు అనుగుణంగా ఉంటుందన్నారు. ఇప్పటికే కొనసాగుతున్న సలహాదారులను సంబంధిత మంత్రులకు సలహాదారులుగా రీ డిజిగ్నేట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇప్పటి వరకూ ఏ బాధ్యతలు నిర్దేశించని సలహాదారులకు నిర్దిష్ట పాత్ర, బాధ్యతలను రూపొందించే పనిలో ప్రభుత్వం ఉందన్నారు. సలహాదారుల నియామక విధానాన్ని మంత్రివర్గం ఆమోదించాక ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తుందన్నారు.

సలహాదారుల నియామకంపై గతంలో పిల్​ : దేవాదాయశాఖ సలహాదారుగా జ్వాలాపురపు శ్రీకాంత్, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారుగా ఎన్.చంద్ర శేఖర్ రెడ్డి నియామకాల్ని సవాల్​ చేస్తూ గతంలో వేర్వేరుగా పిల్​ దాఖలైంది. ప్రభుత్వానికి నచ్చిన వారికి సలహాదారులుగా నియామిస్తున్నారని, సలహాదారులుగా నియమితులైన వారి విద్యార్హతలు పేర్కొనలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఎలాంటి నిబంధనల ప్రకారం వారిని నియమించారో వెల్లడించాలని కోరారు.

ఇవీ చదవండి :

Last Updated : Mar 22, 2023, 9:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.