ETV Bharat / state

CM REVIEW ON INCOME DEPARTMENTS: నాటు సారా తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి: సీఎం జగన్ - Cm jagan news

CM Jagan review of revenue sources departments: రాష్ట్రంలో నాటు సారా తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను కల్పించాలని.. ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. ఆదాయం తీసుకొచ్చే శాఖలపై తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష జరిపిన సీఎం.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

CM
CM
author img

By

Published : Jul 17, 2023, 8:20 PM IST

నాటు సారా తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను కల్పించండి: సీఎం జగన్

CM Jagan review of revenue sources departments: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నాటు సారా తయారు చేస్తున్న వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను కల్పించాలని.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదాయార్జన శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఆదాయార్జన శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మద్యం అమ్మకాలు, ప్రత్యామ్నాయ జీవోనోపాధి మార్గాలు, రిజిస్ట్రేషన్ల వివరాలు, రవాణా రంగంలోని సంస్కరణలపై సీఎం జగన్ సుదీర్ఘంగా చర్చించారు.

ఆదాయార్జన శాఖలపై సీఎం సమీక్ష.. సమీక్షలో భాగంగా 2023–24 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో వివిధ విభాగాల పనితీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విభాగాల వారీగా రెవెన్యూ వసూళ్ల పని తీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ పన్నుల వసూళ్లు జూన్‌ వరకూ 91 శాతానికి చేరినట్లు అధికారుల వెల్లడించారు. జూన్‌ వరకూ రూ.7,653.15 కోట్ల జీఎస్టీ పన్నుల వసూళ్లు అయ్యాయని, గత ఏడాదితో పోలిస్తే 23.74 శాతం వసూళ్ల పెరుగుదల కనిపించిందని పేర్కొన్నారు.

బీరు అమ్మకాలు తగ్గాయి.. అనంతరం గతంతో పోలిస్తే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గాయని, అదే సమయంలో ఆదాయం కూడా పెరిగిందని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. 2018–19తో పోలిస్తే మద్యం అమ్మకాలు తగ్గాయన్నారు. 2018–19లో లిక్కర్‌ అమ్మకాలు 384.36 లక్షల కేసులు కాగా, 2022–23లో 335.98 లక్షల కేసుల అమ్మకాలు జరిగాయన్నారు. 2018–19లో బీరు అమ్మకాలు 277.16 లక్షల కేసులు అమ్ముడు పోగా, 2022–23లో 116.76 లక్షల కేసులు అమ్మకాలు జరిగాయని వివరాలను వెల్లడించారు. 2018–19 ఏప్రిల్, మే, జూన్‌ నెలలతో పోల్చి చూస్తే.. 2023–24లో ఏప్రిల్, మే, జూన్‌ నెలలో బీరు అమ్మకాల్లో మైనస్‌ 56.51 శాతం (తక్కువ) అమ్మకాలు నమోదయ్యాయని, లిక్కర్‌ అమ్మకాల్లో మైనస్‌ 5.28 శాతం అమ్మకాలు నమోదయ్యాయన్నారు.

వారికి ప్రత్యామ్నాయ జీవోనోపాధి మార్గాలు కల్పించండి.. ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నాటు సారా తయారీ చేస్తున్న కుటుంబాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. నాటు సారా తయారీదారులకు ప్రత్యామ్నాయ జీవోనోపాధి మార్గాలను చూపాలన్నారు. ఆ కుటుంబాలకు ఈ కార్యక్రమం కింద రూ.16.17 కోట్లు ఇప్పటికే పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమాలు రాష్ట్రంలో నిరంతరం కొనసాగాలని, ఆయా గ్రామాల్లో నాటు సారా తయారు చేస్తున్న వారిలో చైతన్యం కలిగించాలన్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను సమర్ధవంతంగా అమలయ్యేలా చూడాలన్నారు.

ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగింది.. మరోవైపు గత ఏడాదితో పోలిస్తే..రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగిందని అధికారులు తెలిపారు. రీ సర్వే పూర్తి చేసుకున్న గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని వివరించారు. దాదాపు 5 వేల రిజిస్ట్రేషన్లు గ్రామ సచివాలయాల్లో జరిగాయని వెల్లడించారు. గనులు-ఖనిజాల శాఖ నుంచి గత మూడేళ్లలో 32 శాతం CAGR సాధ్యమైందని తెలిపారు. ఏపీఎండీసీ పనితీరు మెరుగుపడిందన్న అధికారులు.. 2022–23లో 18 వందల రూ.6 కోట్లు వచ్చినట్లు తెలిపారు. ఈ ఏడాది రూ. 4 వేల కోట్లకు చేరుతుందన్నారు. అనంతరం జిల్లాల కలెక్టర్లతో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించి, ఆదాయాలు పెంచుకునే విధానాలపై వారికీ అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

రవాణా రంగంలో సంస్కరణలపై దృష్టి పెట్టండి. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధి విధానాలపై అధ్యయనం చేయండి. అత్యుత్తమ విధానాలను రాష్ట్రంలో అమలు చేయండి. వాహనాల పన్నుల విషయంలో కొత్త విధానాలను అన్వేషించండి. అవి కొనుగోలుదారులను ప్రోత్సహించేలా ఉండాలి. ఆదాయాన్ని ఆర్జించే విభాగాలు జిల్లా కలెక్టర్ల భాగస్వామ్యాన్ని పెంచాలి.. క్రమం తప్పకుండా వారితో సమీక్షలు నిర్వహించండి. ఎక్కడా లీకేజీలు లేకుండా ఉంటే ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వస్తుంది.-వైఎస్ జగన్, రాష్ట్ర ముఖ్యమంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.