ETV Bharat / state

జనసేన అధినేత పవన్‌కల్యాణ్​కు హాని.. సర్వత్రా ఆందోళన - పోతిన మహేశ్

PAWANKALYAN: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై దాడికి రెక్కీపై ఆ పార్టీ నేతలు..కేంద్ర నిఘా వర్గాలకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. భద్రత పెంచాలని జనసేన డిమాండ్ చేయగా, పవన్‌క్ హాని తలపెడితే చూస్తూ ఊరుకోబోమని భాజపా హెచ్చరించింది.

Janasena Pawan Kalyan
పవన్‌కల్యాణ్​
author img

By

Published : Nov 4, 2022, 11:29 AM IST

ATTACK ON PAWANKALYAN: వైకాపా ప్రభుత్వంపైనా, సీఎం జగన్‌పైనా ఇటీవల విరుచుకుపడిన జనసేన అధినేత పవన్‌పై కిరాయి మూకలతో దాడులు చేయించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు.. జనసేన అనుమానం వ్యక్తం చేసింది. ఆగస్టులో కడప జిల్లా సిద్ధవటంలో జరిగిన రైతుభరోసా సభలో కిరాయి హంతకుల ముఠా రెక్కీ నిర్వహించినట్లు ఆ పార్టీ ప్రతినిధులు చెప్తున్నారు. విశాఖలో జనవాణి కార్యక్రమానికి వెళ్తున్న సమయంలోనూ ఇలాంటి ప్రయత్నమే జరిగినట్లు ఇప్పుడు సందేహిస్తున్నారు. హైదరాబాద్‌లోని పవన్‌ ఇంటి వద్ద అనుమానాస్పద వ్యక్తులు ఎక్కువగా సంచరిస్తున్నారని.. విశాఖ ఘటన తరువాత రెక్కీ ఎక్కువైందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. పవన్‌కు ప్రత్యేకంగా భద్రత కల్పించాలని జనసేన నేత పోతిన మహేశ్ కేంద్రాన్ని కోరారు. పవన్‌కు హాని తలపెడితే ఊరుకునేది లేదని మిత్రపక్షం భాజపా హెచ్చరించింది. పవన్‌ కదలికలను వెంటాడడంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.

2019 ఎన్నికలకు ముందే, రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో రక్షణ కల్పించటానికి ప్రయత్నం చేసినా.. పవన్ కళ్యాణ్ తిరస్కరించి సొంత భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు.

పవన్‌కల్యాణ్​కు హాని తలపెడితే ఊరుకునేది లేదు: భాజపా

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.