ETV Bharat / state

అర్ధనగ్న చిత్రాలు సేకరించి.. ఆపై బెదిరించి

author img

By

Published : Nov 23, 2022, 2:05 PM IST

Updated : Nov 23, 2022, 4:20 PM IST

Push The Youth Into Prostitution:తమ అర్ధనగ్న చిత్రాలను సేకరించి.. వ్యభిచార కూపంలోకి నెట్టాలని ఓ మహిళ ప్రయత్నిస్తోందని.. ఇద్దరు యువతలు నగర పోలీసు కమిషనర్‌ కాంతిరాణా టాటాకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఆ మహిళ పలువురు యువతులను ఏమార్చి వ్యభిచారంలోకి దించినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీనిపై లోతుగా దర్యాప్తు చేయాలని విజయవాడ సీపీ కాంతిరాణా టాటా పోలీసులను ఆదేశించారు.

lady
lady

Push The Youth Into Prostitution: తమ అర్ధనగ్న చిత్రాలను సేకరించి.. వ్యభిచార కూపంలోకి నెట్టాలని ఓ మహిళ ప్రయత్నిస్తోందని.. ఇద్దరు యువతులు నగర పోలీసు కమిషనర్‌ కాంతిరాణా టాటాకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఆ మహిళ పలువురు యువతులను ఏమార్చి వ్యభిచారంలోకి దించినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీనిపై లోతుగా దర్యాప్తు చేయాలని విజయవాడ సీపీ కాంతిరాణా టాటా పోలీసులను ఆదేశించారు. టాస్క్‌ఫోర్సు పోలీసులతో.. ఒక బృందాన్ని దర్యాప్తునకు నియమించినట్లు తెలిసింది. ఇటీవల కాలంలో యువతులను ఏమార్చే ముఠాలు నగరంలో తిరుగుతున్నాయని దర్యాప్తు బృందం కనుగొన్నారు. అయితే ఈ సంఘటన వెలుగులోకి రావడంతో నగరంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఓ మహిళ కొంతకాలంగా పటమటలో.. ఒక వస్త్రదుకాణం నిర్వహిస్తోంది. తన దుకాణానికి వచ్చే యువతులతో పరిచయం పెంచుకుని వారిని కిట్టిపార్టీలకు ఆహ్వానిస్తోంది. ఆ పార్టీలో కూల్​డ్రింక్స్​లో మద్యం కలిపి, మరికొంత మందికి నేరుగా మద్యం అలవాటు చేస్తోంది. ఇలా అలవాటు అయిన వారి.. మద్యం తాగే చిత్రాలు, వస్త్రాలు మార్చుకునే సమయంలో నగ్న చిత్రాలు రహస్యంగా సేకరించేది. తర్వాత వారికి డబ్బు ఆశ చూపి వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేసేది. లొంగనివారికి.. వారి నగ్న చిత్రాలు చూపి బెదిరింది వ్యభిచారం చేయిస్తుంటుంది. బాధితుల చిత్రాలను.. విటులకు చూపించి.. బేరాలు కుదుర్చుకుంటుంది. హైప్రొఫైల్‌ వ్యక్తులతో పరిచయాలు పెంచుకుని.. వ్యభిచార కూపంలోకి నెట్టే ప్రయత్నం చేసేది. ఇలా ఇటీవల ఓ యువకుడికి.. తన వద్ద ఉన్న ఓ యువతి చిత్రాలను చూపించి రూ.లక్షకు బేరం కుదుర్చుకుంది. దీనికి మరో మధ్యవర్తి ఉన్నట్లు తెలిసింది. తర్వాత ఆ యువతిని పంపించడంలో జాప్యం జరగడం.. యువకుడు ఒత్తిడి చేయడంతో.. ఆ మహిళ యువతిని బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభించింది.

దీనికి తట్టుకోలేని ఆ యువతి.. మరో బాధితురాలితో కలిసి నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. తమ పరువుకు భంగం కలుగకుండా చర్యలు తీసుకోవాలని.. ఆ మహిళ పూర్తి చరిత్రను పోలీసులకు తెలిపారు. ఈ వ్యవహారాన్ని టాస్క్‌ఫోర్సు పోలీసులకు సీపీ అప్పగించారు. దీంతో ఈ సంఘటన చర్చనీయాంశమైంది. ఇదే మహిళపై పటమట పోలీసు స్టేషన్‌కు ఇటీవల ఒక ఫిర్యాదు వచ్చింది. తనకున్న పలుకుబడితో దాన్ని బయటకు రాకుండా చేసినట్లు తెలిసింది.

ఈ మహిళకు ఓ స్పా నిర్వాహకుడికి మధ్య ఘర్షణ జరిగింది. స్పాకు యువతులను పంపడంలో.. లావాదేవీల గురించి ఈ ఘర్షణ జరిగింది. పటమట మీసేవ వద్ద ఇద్దరూ బాహాబాహీకి దిగారు. ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఆ యువకుడికి, పోలీసులకు ఉన్న సాన్నిహిత్యంతో.. కేసు నమోదు కాకుండా మాయం చేశారని తెలిసింది.

ఇవీ చదవండి:

Last Updated : Nov 23, 2022, 4:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.