Wife Attack With Blade : నంద్యాల జిల్లాలోని గోస్పాడు మండలం కానాలపల్లె గ్రామానికి చెందిన బ్రహ్మయ్య, లక్షీదేవి దంపతులు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు చిన్నారులు సంతానం. అయితే భార్యపై అనుమానంతో గత నెల డిసెంబరు 25 తేదీన ఆమె గొంతు కోశాడు. బంధువులు లక్షీదేవిని నంద్యాల ప్రభూతాసుపత్రికి తరలించారు. గొంతు కోసిన సమయం నుంచి బ్రహ్మయ్య కనపడటం లేదు. లక్షీదేవి చికిత్స పొందుతూ కోలుకుంటుంది. చికిత్స తీసుకుంటున్న ఆమె కొబ్బరి నీళ్ల కోసమని ఆసుపత్రి బయటకు వచ్చింది. ఆసుపత్రి ఆవరణలో ఆమెకు భర్త కనిపించాడు. గొంతు కోసిన తర్వాతనుంచి కనిపించని భర్త ఆకస్మాత్తుగా కనిపించటంతో ఆమెకు అనుమానం కలిగింది. అతని చేతిలో బ్లేడు ఉండటంతో మళ్లీ గొంతు కోయటానికి వచ్చాడనే అనుమానం ఆమెకు కలిగింది. వెంటనే భర్త వద్దకు ముసుగు ధరించి వెళ్లి భర్త చేతిలో ఉన్న బ్లేడునే తీసుకుని గొంతు కోశానని తెలిపింది. బ్రహ్మయ్యకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ వివరాలను నమోదు చేసుకున్నారు.
"ముసుగు ధరించి నా భార్య దగ్గరకి వచ్చింది. ఎందుకు ఇలా వచ్చావని అడిగితే నా గొంతు కోశావు కదా, నీ గొంతు కోస్తా అని కోసింది. దాంతో అక్కడున్న వాళ్లు నా భార్యను అడ్డుకున్నారు." - బ్రహ్మయ్య, భర్త
"బ్లేడు పట్టుకుని నా వెనకలే వచ్చాడు. ఇంతక ముందు నా గొంతు కోశాడు. మళ్లీ కోస్తాడేమో అనే భయంతో, నా భర్త చేతిలోనీ బ్లేడు తీసుకునే అతని గొంతు కోశాను. ఆసుపత్రిలోనే తిరుగుతున్నాడని తెలిసింది. ఇంతక ముందు కోశాడు కదా.. మళ్లీ కోస్తాడు అనుకుని కోసాను." -లక్షీదేవి, భార్య
ఇవీ చదవండి: