roads in Dhone అభివృద్ధికి సూచికలుగా చెప్పుకునే రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. మారుమూల పల్లె నుంచి జాతీయ రహదారుల వరకు అన్నింటిదీ అదే దుస్థితి. నంద్యాల జిల్లా డోన్‌లో వెంకటనాయుని పల్లెకు వెళ్లే రహదారిలో ప్రయాణమంటేనే సాహసం చేయాల్సిందే. 250 మీటర్ల పొడవులో 120 గుంతలు ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. డోన్ నుంచి గోవర్ధనగిరి రోడ్డుకు గత ప్రభుత్వ హయాంలో 3 కోట్ల యాభై లక్షల రూపాయలు మంజూరయ్యాయి. కొన్ని రోజులు పనులు కూడా చేశారు. కానీ ప్రభుత్వ మారడంతో పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. అప్పటి నుంచి వాటిని పట్టించుకునే నాధుడే లేడు. నిత్యం రద్దీగా ఉండే దారిలో మరమ్మతులకు నోచుకోక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వర్షం పడితే గుంతల్లో నీరు నిలిచి వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. రోడ్డు కోసం ఎన్ని అర్జీలు సమర్పించినా అధికారులు పట్టింటుకోవట్లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవడి:
- తెలంగాణలో 18 ఏళ్లుగా గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్న ముస్లిం వ్యక్తి
- అందాల కేతిక.. కరాటే, స్విమ్మింగ్‌లోనూ కేక
- దళిత బాలుడిపై దారుణం.. గణేశుడి విగ్రహాన్ని తాకాడని మూకదాడి