ETV Bharat / state

Attack on Hospital: 'నేను తలచుకుంటే ఆస్పత్రే ఉండదు'.. వైకాపా నేత అనుచరుడి బెదిరింపు

author img

By

Published : Apr 8, 2022, 6:57 AM IST

Updated : Apr 8, 2022, 9:09 AM IST

Attack on hospital staff: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని సుజాత ఆసుపత్రి సిబ్బందిపై.. శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనుచరుడు దాడికి పాల్పడ్డాడు. బాషా అనే ఓ వ్యక్తి గర్భిణి అయిన తన కుమార్తెతో ఆస్పత్రికి వచ్చారు. రక్తస్రావం, నొప్పులతో బాధపడుతున్న ఆమెను.. సిబ్బంది ఆసుపత్రిలో చేర్చుకుని చికిత్స అందించారు. అనంతరం బిల్లు చెల్లించాలని అడగ్గా, వారిపై బాషా దౌర్జన్యం చేశారు. తన అనుచరులను వెంటబెట్టుకొచ్చి సిబ్బందిపై దాడి చేశారు.

bireddy siddharth reddy follower attacked on medical staff
ఆస్పత్రి సిబ్బందిపై బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనుచరుడి దాడి

Attack on hospital staff: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని సుజాత ఆసుపత్రి సిబ్బందిపై వైకాపా నేత, శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనుచరుడు చికెన్‌బాషా దాడికి పాల్పడిన ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైద్యురాలు సుజాత కథనం మేరకు.. ‘ముచ్చుమర్రికి చెందిన బాషా బుధవారం ఐదు నెలల గర్భిణి అయిన తన కుమార్తెతో ఆసుపత్రికి వచ్చారు. రక్తస్రావం, నొప్పులతో బాధపడుతున్న ఆమెను సిబ్బంది ఆసుపత్రిలో చేర్చుకుని పరీక్షలు చేసి, చికిత్స అందించారు. బిల్లు చెల్లించాలని అడగ్గా, వారిపై బాషా దౌర్జన్యం చేశారు. తన అనుచరులను వెంటబెట్టుకొచ్చి సిబ్బందిపై దాడి చేశారు. నాపైనా దుర్భాషలాడారు.

‘మర్డర్లు చేయడం నా వృత్తి. నన్నే డబ్బులు అడుగుతారా? మిమ్మల్ని చంపేస్తా’ అని భయపెట్టారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మనిషినని, తాను తలచుకుంటే సాయంత్రానికి ఆసుపత్రి లేకుండా చేస్తానని బెదిరించారు’ అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సుజాత వివరించారు. గురువారం సాయంత్రం సిద్ధార్థరెడ్డి అనుచరులు, యాదవ సంఘం నాయకులు ఆసుపత్రికి వచ్చి కేసు లేకుండా రాజీ చేసేందుకు మంతనాలు సాగించారు.

నందికొట్కూరు ఎస్సై రమణను వివరణ కోరగా.. వైద్యురాలు, సిబ్బంది స్టేషన్‌కు వచ్చారని, ఫిర్యాదు పత్రంపై సంతకం లేదన్నారు. సంతకం కోసం పోలీసులను ఆసుపత్రికి పంపినా, సంతకం చేయలేదని చెప్పారు.

ఇదీ చదవండి:

టార్చిలైట్ల వెలుగులో ప్రసవం... పసికందు సైతం అనుభవిస్తున్న కరెంటు కష్టాలు

Last Updated : Apr 8, 2022, 9:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.