PD Act: నంద్యాల జిల్లాలో 24మంది రౌడీ షీటర్లపై పీడీ యాక్ట్ నమోదు చేశామని కర్నూలు రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్ తెలిపారు. కర్నూలు డీఐజీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. కర్నూలు రేంజ్ పరిధిలో నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఒకేసారి 24 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేయడం రాష్ట్ర చరిత్రలో మొదటిసారి అని ఆయన తెలిపారు. నేరాలకు పాల్పడిన తర్వాత జైలు శిక్ష అనుభవించి.. బయటకు వచ్చిన తర్వాత ప్రవర్తన మారనివారిపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు. నాటు సారా తయారీ, విక్రయాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, త్వరలో కర్నూలు రేంజ్ పరిధిలోని అన్ని జిల్లాల్లో వంద శాతం నాటుసారాను అరికడుతామన్నారు.
ఇవీ చదవండి: