Karnataka CM donated Rs.5 crore check: శ్రీశైల జగద్గురు పీఠాధిపతి డాక్టర్ చెన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి చేపట్టిన రాష్ట్రీయ జన జాగృతి సమ్మేళనం కార్యక్రమానికి కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, మంత్రులు సీసీ పాటిల్, మురుగేష్ నిరాణి శ్రీశైలంలో హాజరయ్యారు. అనంతరం కర్ణాటక సీఎం బాగల్ కోట్‌కు చెందిన నిత్యాన్నదాన సత్రాన్ని ప్రారంభించి, జగద్గురు పీఠాధిపతి సభా ప్రాంగణానికి హాజరయ్యారు.
వేదికపై కాశీ, ఉజ్జయిని, శ్రీశైలం పీఠాధిపతులు కొలువు తీరగా.. అక్కడికి చేరుకున్న కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, మాజీ సీఎం యడ్యూరప్పకు నిర్వాహకులు స్వాగతం పలికారు. జగద్గురు పీఠాధిపతి శ్రీశైలంలోని పది ఎకరాల్లో నిర్మించ తలపెట్టిన కంబి మండపం, వసతి గదుల సముదాయం, ఆసుపత్రి, వీరశైవ ఆగమ పాఠశాల, ఆంగ్ల పాఠశాలలకు సంబంధించిన ఫలకాలను కర్ణాటక సీఎం ఆవిష్కరించారు.
అనంతరం జగద్గురు పీఠాధిపతి తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు కర్ణాటక ప్రభుత్వం తరఫున రూ. 5 కోట్ల విరాళం చెక్కును ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పీఠాధిపతికి అందజేశారు. జగద్గురు పీఠాధిపతి.. కర్ణాటక నుంచి శ్రీశైలం వరకు పాదయాత్ర నిర్వహించి, సమాజాభివృద్ధి కోసం చేస్తున్న కృషిని కర్ణాటక సీఎం కొనియాడారు.
ఇవీ చదవండి