ETV Bharat / state

HIGH COURT: 'నంద్యాల పట్టణంలో ప్రభుత్వ భూముల వివరాలివ్వండి' - nandyala medical college petition news

నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి చెందిన 50 ఎకరాల్ని .. వైద్య కళాశాల నిర్మాణానికి కేటాయించడాన్ని నంద్యాలకు చెందిన దశరథరామిరెడ్డితోపాటు మరో నలుగురు హైకోర్టులో పిల్ వేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం.. వైద్య కళాశాల ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులతోపాటు నంద్యాల పట్టణ పరిధిలోని ప్రభుత్వ భూముల వివరాలకు సంబంధించిన రిజిస్టర్లను కోర్టు ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

హైకోర్టు
హైకోర్టు
author img

By

Published : Apr 20, 2022, 3:53 AM IST

నంద్యాలలో వైద్య కళాశాల ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులతోపాటు నంద్యాల పట్టణ పరిధిలోని ప్రభుత్వ భూముల వివరాలకు సంబంధించిన రిజిస్టర్లను కోర్టు ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర , జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి చెందిన 50 ఎకరాల్ని .. వైద్య కళాశాల నిర్మాణానికి కేటాయిస్తూ రెవెన్యూశాఖ 2020 డిసెంబర్ 12 న జారీ చేసిన జీవో 341 ను , వ్యవసాయ యూనివర్సిటీ పాలకమండలి చేసిన తీర్మానాన్ని సవాలు చేస్తూ నంద్యాలకు చెందిన బొజ్జా దశరథరామిరెడ్డి , మరో నలుగురు హైకోర్టులో పిల్ వేశారు . ఇదే అంశంపై న్యాయవాది ఎన్.ఆదిరామకృష్ణుడు మరో వ్యాజ్యం దాఖలు చేశారు.రైతులకు వ్యవసాయ పరిశోధన కేంద్రం మేలైన సేవలు అందిస్తుందని..దీనికి 120 ఏళ్ల చరిత్ర ఉందని తెలిపారు. వైద్య కళాశాల కోసం 50 ఎకరాలు తీసుకోవాలని ప్రభుత్వం చూస్తోందని తెలిపారు . వైద్య కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వ భూములు సమీపంలో లభ్యంగా ఉన్నాయని తెలిపారు . వాటిని పరిశీలించకుండా పరిశోధన కేంద్రానికి చెందిన 50 ఎకరాలను తీసుకుంటున్నారని న్యాయస్థానానికి దృష్టికి తీసుకొచ్చారు . నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి 10కిలోమీటర్ల లోపు వైద్య కళాశాల ఏర్పాటు చేయాల్సి ఉందని...ఆ సమీపంలో ప్రభుత్వ భూములు లేనందున వ్యవసాయ పరిశోధన కేంద్రం భూములు తీసుకోవడం జరుగుతోందని అదనపు ఏజీ వాదనలు వినిపించారు. ప్రభుత్వ ఉత్తర్వులతోపాటు భూముల వివరాలు అందించాలంటూ విచారణను వారం రోజుల పాటు హైకోర్టు వాయిదా వేసింది.

ఇదీ చదవండి: వైద్య కళాశాలకు భూ కేటాయింపుపై హైకోర్టులో పిల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.