Jagananna Vasathi Deevena: రాష్ట్రవ్యాప్తంగా జగనన్న వసతి దీవెన రెండో విడత సాయాన్ని ముఖ్యమంత్రి జగన్ నేడు విడుదల చేయనున్నారు. నంద్యాలలో జరిగే బహిరంగ సభలో 10.68 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1,024 కోట్లను జమ చేస్తారు. పేదరికం కారణంగా ఏ విద్యార్థీ ఉన్నత చదువులకు దూరం కాకూడదనే ఆలోచనతోనే వారి భోజన, వసతి ఖర్చులను చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది.
CM Jagan Nandyal District tour: ఈ పథకం కింద ఏటా రెండు విడతల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, వైద్య, తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున వసతి, భోజన ఖర్చులకు చెల్లిస్తున్నట్లు పేర్కొంది.
ఇదీ చదవండి; CBN On Power Cuts: రాష్ట్రం చీకట్లోకి వెళ్లిపోయింది - చంద్రబాబు