Allegations on Srisailam Devasthanam EO Lavanna: గత కొంత కాలంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ దేవాలయాలకు సంబంధించి చోటుచేసుకుంటున్న పరిమాణాలపై భక్తులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా శ్రీశైలం దేవస్థానంలో ఈవో లవన్న( Srisailam Temple EO Lavanna) తీరు అనేక విమర్శలకు దారి తీస్తోంది. లవన్నను ప్రభుత్వం బదిలీ చేసినప్పటికీ.. అదే స్థానంలో కొనసాగుతున్నారు. లవన్న స్థానంలో నూతన ఈవోగా నియమితులైన అధికారికి సైతం దేవదాయ శాఖ నుంచి ఎలాంటి సహకారం లభించడం లేదు. దీంతో శ్రీశైలం దేవస్థానంలో మరోసారి వివాదం తలెత్తింది.
నంద్యాల జిల్లా శ్రీశైలంలోని దేవస్థానం కార్యనిర్వాహణాధికారి (Executive Officer) యస్. లవన్న బదిలీపై వివాదం కొనసాగుతోంది. ఈవో లవన్నను ఈనెల 5వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం సాధారణ బదిలీల్లో భాగంగా అనంతపురం జిల్లా గుంతకల్ ఆర్డీవోగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డి.పెద్దిరాజును శ్రీశైల దేవస్థాన నూతన ఈవోగా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో శ్రీశైల దేవస్థానం (Srisailam Temple) విధుల నుంచి లవన్న రిలీవ్ కాకుండా కొనసాగుతుండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఉద్యోగులకు, అటు ట్రస్ట్ బోర్డు సభ్యులు సైతం ఆయన వ్యవహార శైలిపై (Srisailam Temple Board of Trustees) తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా... శ్రీశైల దేవస్థానం నూతనంగా నిర్మించిన 220 వసతి గదుల సముదాయంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ నెల 19వ తేదీన ప్రారంభించడానికి లవన్న నిర్ణయం తీసుకున్నారు. బదిలీ అయి, జైలు శిక్ష పడిన లవన్న శ్రీశైల దేవస్థానం ప్రారంభోత్సవ కార్యక్రమాలను తన చేతుల మీదుగా జరిపించడానికి చేస్తున్న ప్రయత్నాలపై ధర్మకర్తల మండలి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం మంచి రోజులు లేనందున అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలను వచ్చే నెలకు వాయిదా వేయాలని ధర్మకర్తల మండలి చైర్మన్ చక్రపాణి రెడ్డి కోరారు. ఈ మేరకు దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ముఖ్య కార్యదర్శి, కమిషనర్లకు లేఖలు రాశారు. ఈవో లవన్న ఈ స్థాయిలో రెచ్చిపోవడం వెనక ఓ మంత్రితో పాటు... ప్రభుత్వ పెద్దలు అండదండలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
నెల రోజుల జైలు శిక్ష: ఈవో లవన్నకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నెల రోజుల జైలు శిక్ష జరిమానా విధించింది. లవన్న కడప మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన హయాంలో ఒక మహిళ ఇంటిని హైకోర్టు స్టే ఉన్నప్పటికీ తొలగించారు. ఈ కేసు విచారించిన న్యాయస్థానం లవన్నకు నెల రోజుల జైలు శిక్ష రూ. 2వేల జరినామా విదించింది. అప్పీలుకు వీలుగా మూడు వారాల సమయం ఇచ్చింది.
కడప మున్సిపల్ మాజీ కమిషనర్ లవన్న కోర్టుకు రావాలి.. హైకోర్టు ఆదేశం