ETV Bharat / state

శాలరీ కావాలంటే 2వేలు పంపండి "సార్" - విద్యాశాఖలో పైసా వసూల్ - CORRUPTION IN EDUCATION DEPARTMENT

రాష్ట్ర విద్యాశాఖలోని కొంత మంది సిబ్బంది నయా దందా

OFFICERS COLLECTING MONEY
Officers Collecting Money From New Teachers (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 27, 2024, 1:54 PM IST

Officers Collecting Money From New Teachers : కొత్తగా టీచర్ జాబ్​లో చేరిన వారికి జీతం అందాలంటే రూ.2వేలు లంచం ఇవ్వాల్సిందేనా? నగదు ఇచ్చేందుకు ఇబ్బంది అనుకుంటే గూగుల్ ఫే, ఫోన్ ఫే ద్వారా ఇవ్వాలంటూ డైరెక్టుగానే చెప్తున్న పరిస్థితి హైదరాబాద్​లో నెలకొంది. కిందిస్థాయి సిబ్బంది ఇలా డిమాండ్ చేయడం ఇబ్బందికరంగా మారిందని సదరు ఉపాధ్యాయులు వాపోతున్నారు. మండలాల వారీగా విధులు నిర్వహిస్తున్న విద్యాశాఖ అధికారుల్లో కొంత మంది పరోక్షంగా ఈ బలవంతపు వసూళ్లు ప్రోత్సహిస్తున్నందుకే కొత్త టీచర్లు మౌనం పాటిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు.

జగన్​ అంటే లోకల్​ అనుకుంటివా? ఇంటర్నేషనల్​! - అవినీతిలో తగ్గేదేలే

లంచం.. లంచం.. లంచం : హైదరాబాద్​లో 680 మంది ఉపాధ్యాయులు కొత్తగా విధుల్లో చేరారు. నవంబరు నెల జీతం డిసెంబర్ మొదటి వారంలో వస్తుంది. అయితే పాఠశాలల వారీగా వారిని గుర్తించి నెల జీతం రావాలలంటే లంచం ఇవ్వాలని నవంబరు రెండోవారంలో వారికి చెప్పారు. ఈ నెల 24లోపు అందరి దగ్గర డబ్బులు వసూలు చేసే బాధ్యతను ఇద్దరు వ్యక్తులకు ముట్టజెప్పారు. అన్ని మండలాల్లో ఈ వసూళ్లు జరుగుతున్నా మా వద్ద ఎవరూ డబ్బు వసూలు చేయడం లేదని అధికారులు బుకాయిస్తున్నారు. సికింద్రాబాద్‌ పరిధిలోని ఓ మండల విద్యాధికారిని దీనిపై ప్రశ్నించగా తాము పైసలు వసూలు చేయడం లేదని తెలిపారు.

వీళ్లిద్దరి బంధం చాలా కాస్ట్లీ - పోర్టుల నుంచి మీటర్ల దాకా అన్నీ అదానీకే

పైసా వసూల్ : హైదరాబాద్‌ సహా రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విధులు చేస్తున్న టీచర్ల జీతాల బిల్లులకు ఆమోద ముద్ర వేయించేందుకు ఒక్కొక్క టీచర్ నుంచి రూ.500 నుంచి రూ.వెయ్యి వరకూ వసూలు చేస్తున్నారు. ప్రతి ఉపాధ్యాయుడికి రావాల్సిన జీతానికి సంబంధించిన బిల్లును ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వెంటనే సంబంధిత ప్రధాన ఉపాధ్యాయుడికి లేదా మండల విద్యాధికారికి కంప్యూటరులో సందేశం వస్తుంది.

ఉపాధ్యాయుడు జీతం బిల్లును సక్రమంగా నమోదు చేశారా లేదా అని పరిశీలించాక ఓటీపీ నమోదు చేస్తే బిల్లు పాసవుతుంది. అందుకు విరుద్ధంగా ఓటీపీలను కొందరు ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు ఇతరులకు ఇచ్చి బిల్లులు చేయిస్తున్నారు. ఓటీపీలు సైతం వారికే ఇస్తున్నారు. ఈ విధంగా వసూలు చేస్తున్న సొమ్ము ప్రైవేటు వ్యక్తులు తీసుకుంటున్నారా? లేక వారికే ఇస్తున్నారా? అని ఉన్నతాధికారులు విచారణ జరిపితే అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడ్డే అవకాశం ఉంటుంది.

సొంతలాభం కోసం ప్రజలపై భారాన్నీ లెక్కచేయని జగన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.