ETV Bharat / state

Accused Arrested in Case of Murder at Agriculture Market in Doan: నంద్యాల జిల్లాలో కక్షసాధింపు హత్యలు.. నిందితుడి అరెస్ట్.. కేసు వివరాలు వెల్లడి..

Accused Arrested in Case of Murder at Agriculture Market in Doan: నంద్యాల జిల్లాలో గత నెల 29వ తేదీన డోన్​ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్​ వద్ద జరిగిన హత్య కేసులో ఉన్న నిందితుడిని అరెస్ట్​ చేసినట్లు డోన్​ డీఎస్పీ శ్రీనివాస్​ రెడ్డి తెలిపారు.. ఈ హత్యకు గల కారణాలను ప్రెస్​మీట్​ నిర్వహించి వివరించారు.

murder_at_mgriculture_market_in_doan
murder_at_mgriculture_market_in_doan
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2023, 2:09 PM IST

Accused Arrested in Case of Murder at Mgriculture Market in Doan: నంద్యాల జిల్లాలో కక్షసాధింపు హత్యలు.. నిందితుడు అరెస్ట్.. కేసు వివరాలు వెల్లడి

Accused Arrested in Case of Murder at Agriculture Market in Doan: గత నెల 29వ తేదీన నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని వ్యవసాయం మార్కెట్ వద్ద జరిగిన లక్ష్మన్న హత్య కేసులో ఆదివారం సాయంత్రం నిందితుడిని అరెస్టు చేసినట్లు డోన్ డీఎస్పీ శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. తన తమ్ముడు బింగి శ్రీనివాసుల్ని హత్య చేసిన కేసులో ముద్దాయిగా ఉన్న ప్యాపిలి మండలం చండ్రపల్లి గ్రామానికి చెందిన లక్ష్మన్నను బింగి రంగారావు హత్య చేసి ప్రతీకారం తీర్చుకున్నారని పట్టణ పోలీస్ స్టేషన్​లో డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి వివరించారు.

Korutla Deepthi Murder Case Update : వీడిన కోరుట్ల దీప్తి హత్య కేసు మిస్టరీ.. చందన, ఆమె ప్రియుడే హంతకులు

DSP Revealed the Details of Lakshmana Murder: డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం ప్యాపిలి మండలం బావిపల్లి క్రాస్ వద్ద లక్ష్మన్న, బింగి శ్రీనివాసులు నూతనంగా ఇల్లు నిర్మించుకున్నారు. 2021లో లక్ష్మన్న గృహప్రవేశం చేయగా వచ్చిన బంధువులకు బింగి శ్రీనివాసులు ఇంట్లో వసతి కల్పించాలని అడిగారు. అప్పటి నుంచి శ్రీనివాసులు ఇంట్లో బంగారు చోరీ అయిందని లక్ష్మన్న భార్యపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగి ఘర్షణ పడ్డారు. అప్పట్లో జలదుర్గం పోలీస్ స్టేషన్​లో వీరిపై కేసు కూడా నమోదు అయింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మనస్పర్థలు పెరిగాయి. పాత గొడవలు మనసులో ఉంచుకొని బావిపల్లి క్రాస్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న ఇంటి వద్ద శ్రీనివాసులు మంచంపై పడుకుని ఉండగా జనవరి 12, 2022న లక్ష్మన్న గొడ్డలితో శ్రీనివాసులు ముఖంపై నరికి చంపాడు. ఈ హత్య కేసులో ముద్దాయిగా ఉన్న లక్ష్మన్నను అరెస్ట్ చేసి రిమాండ్​కు పంపారు. ఇతనిపై రౌడీ షీటర్ కూడా నమోదు చేశారు.

Cyber Fraud With Fake Fingerprints: నకిలీ వేలిముద్రలతో రూ.6 కోట్లు కాజేసిన ముఠా అరెస్టు

Murder at Doan Farmers Market: అప్పటి నుంచి లక్ష్మన్న తన సోదరి గ్రామమైన అనంతపురం జిల్లా నార్పల మండలం కాశేపల్లి గ్రామంలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ హత్య కేసులో గత నెల 29వ తేదీన ఆటోలో కర్నూల్ కోర్టులో హాజరై తిరిగి అనంతపురానికి వెళ్తుండగా ఆటో రిపేర్ చేయించుకోవడానికి డోన్ పట్టణంలోకి వచ్చారు. ఆటో సైలెన్సర్​కు రంద్రం పడిందని గ్యాస్ వెల్డింగ్ చేయించుకోవడానికి డోన్ వ్యవసాయ మార్కెట్ ముందు ఉన్న దుకాణం వద్దకు వచ్చారు. అక్కడే ఉన్న బింగి శ్రీనివాసులు అన్న బింగి రంగారావు లక్ష్మన్నను చూసి వేట కొడవలి తీసుకుని ముఖానికి శిరస్తారణం (Helmet) ధరించి లక్ష్మణ్ దగ్గరికి వచ్చాడు.

Ganja Seized in Chinatapalli: అల్లూరి జిల్లాలో రూ.కోటి విలువైన గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్​

Attack on Lakshmana With Hunting Machete: లక్ష్మన్నపై వేట కొడవలితో ముఖంపై నరికి దాడి చేసి పారిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న లక్ష్మన్నను పోలీసులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లక్ష్మన్న మృతి చెందాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా ఈ రోజు సాయంత్రం బింగి రంగారావు డోన్ జాతీయ రహదారిలోని రాజధాని డాబా వద్ద బింగి రంగారావు ఉండగా.. అరెస్టు చేసి అతని వద్ద ఉన్న వేటకుడవలి, ద్విచక్ర వాహనము పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుని కోర్టులో హాజరు పరిచి, రిమాండ్​కు తరలించినట్టు డీఎస్పీ పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.