సుమారు 40 రోజుల తర్వాత కర్నూలు జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. మార్చి 28న జిల్లాలో మొదటి పాజిటివ్ కేసు నమోదైంది. ఆ తర్వాత ఏప్రిల్ 4 న మూడు పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. అనంతరం ప్రతి రోజు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ మొదటిసారి.. ఒక్క కేసు కూడా నమోదు కాకపోవటంపై అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
జిల్లాలో ఇప్పటి వరకు 591 పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒకరు మృత్యువాత పడగా... ఇప్పటి వరకు 18 మంది మరణించారు. నిన్న 19 మంది డిశ్చార్జ్ కాగా... మొత్తం 316 మంది పూర్తి స్థాయిలో కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 257 మంది కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి: